Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కె.ఎస్.ఫిలిం వర్క్స్ బ్యానర్‌పై సత్య ఎస్కె, చందన రాజ్ జంటగా రూపొందుతున్న చిత్రం 'రిచి గాడి పెళ్లి'. ఈ చిత్రంలోని రెండో సాంగ్‌ను యువ హీరో సందీప్ కిషన్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'శ్రీమణి రాసిన 'నా నిన్నలలో కన్నులలో..' లిరిక్స్, శక్తి శ్రీ గోపాలన్, సత్యన్ పాడిన తీరు చాలా బాగున్నాయి. విజువల్ ట్రీట్‌లా అనిపించింది. కె.ఎస్.హేమ రాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా చాలా సజనాత్మకంగా ఉంది. మనం చిన్నప్పుడు బల్లల మీద ఆడుకున్న చిన్న చిన్న ఆటలను ఆధారం చేసుకుని తీసిన సినిమా ఇది. ఆ చిన్న ఆట వల్ల, వాళ్ళ జీవితాలు ఎలా మలుపులు తిరిగాయి అనేదే ఈ సినిమా. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది' అని అన్నారు.
'మానవ సంబంధాలకు అద్దం పట్టే కథ. ప్రతి పాత్రలో వేరియేషన్ ఉండేలా డిజైన్ చేశాం. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం' అని దర్శకుడు కె.ఎస్.హేమ రాజ్ చెప్పారు. ఈ చిత్రానికి నిర్మాత : కె.ఎస్. ఫిిల్మ్ వర్క్స్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : రామ్ మహీంద్రా, శ్రీ, సహ నిర్మాత : సూర్య మెహర్.