Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'సర్కారు వారి పాట' ప్రీ రిలీజ్ వేడుకలో మహేష్‌బాబు
మహేష్ బాబు తాజాగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమా కోసం అటు మహేష్ అభిమానులు, ఇటు ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. దర్శకుడు పరశురాం అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్‌గా తీర్చిదిద్దిన ఈ చిత్రం ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానులు కేరింతల మధ్య హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ, 'రెండేళ్ళ తర్వాత అభిమానులను ఈ వేడుక ద్వారా కలుసుకోవడం ఆనందంగా ఉంది. దర్శకుడు పరశురాం ఈ సినిమాలో నా పాత్రని అద్భుతంగా డిజైన్ చేశారు. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అన్ని కొత్తగా, వినోదాత్మకంగా ఉంటాయి. కొన్ని సీన్లు చేస్తున్నపుడు 'పోకిరి' రోజులు గుర్తుకు వచ్చాయి. కీర్తి సురేష్ పాత్ర అద్భుతంగా ఉంటుంది. తమన్ మరోసారి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. 'కళావతి..' పాట ఎంత పెద్ద విజయమో మీ అందరికీ తెలుసు. తమన్ రీరికార్డింగ్‌కి పెద్ద ఫ్యాన్ నేను. ఈ సినిమాలో ఆర్ఆర్ ఇరగదీశాడు. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ యాక్షన్ అద్భుతంగా డిజైన్ చేశారు. 'సరిలేరు నికెవ్వరు'లో 'మైండ్ బ్లాక్' మించి ఈ సినిమాకి కోరియోగ్రఫీ చేశారు శేఖర్ మాస్టర్. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు కూడా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ గారు మొదటి రోజు నుంచి ఈ సినిమా 'పోకిరి'ని దాటుతుందని పాజిటివ్ ఎనర్జీ నింపారు. అనంత్ శ్రీరామ్ మంచి సాహిత్యం అందించారు. డీవోపీ మధి అత్యద్భుతమైన విజువల్ ట్రీట్ ఇచ్చారు. మైౖత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ నిర్మాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నా. మన కాంబినేషన్లో మరో బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. ఈనెల 12న మీ అందరికీ నచ్చే సినిమా రాబోతుంది. మళ్ళీ మనందరికీ పండగే' అన్నారు.
'నేను తయారు చేసుకున్న 'సర్కారు వారి పాట' కథని మహేష్ బాబు గారి దగ్గరకి తీసుకెళ్లడానికి కొరటాల శివగారు హెల్ప్ చేశారు. మహేష్ బాబు గారికి మొదట కథ చెప్పినపుడు భయం వేసింది. ఐదు నిమిషాల నేరేషన్ తర్వాత ఆయన ముఖం పై ఒక నవ్వు కనిపించింది. ఆ నవ్వే ఇక్కడి వరకూ తీసుకొచ్చింది. నన్ను ఇంత నమ్మిన మహేష్ గారికి లైఫ్ లాంగ్ థ్యాంక్స్ చెప్పిన సరిపోదు. నా విజన్ తెరపై చూపించడానికి ఎక్కడా రాజీ పడకుండా సినిమాని నిర్మించిన నిర్మాతలకు, ఎంతో ఇష్టపడి పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్. ఈ నెల 12న బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం' అని దర్శకుడు పరశురాం చెప్పారు.
నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ,'మహేష్ గారు మాకు 'శ్రీమంతుడు' లాంటి బ్లాక్ బస్తర్ హిట్ ఇచ్చి ఇండిస్టీలోకి గ్రాండ్ వెల్కమ్ ఇప్పించారు. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. దర్శకుడు కథ చెప్పినప్పటి నుంచి జర్నీ ఒక పండగలా జరిగింది. పరశురాం గారు ఈ కథ మహేష్ గారి కోసం పుట్టిందని అన్నారు. ట్రైలర్, మామా మహేషా పాట చూసిన తర్వాత పరశురాం అలా ఎందుకు అన్నారో అర్ధమైయింది. కీర్తి సురేష్‌ని కొత్తగా చూస్తాం. తమన్ అద్భుతమైన ఆల్బం ఇచ్చారు. సినిమా యూనిట్ అందరికీ కతజ్ఞతలు. మీరు ఊహించిన దాని కంటే సినిమా అద్భుతంగా ఉంటుంది' అని తెలిపారు. 'మహేష్ బాబుగారిని దర్శకుడు పరశురాం అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఈనెల 12న అభిమానులకు ఒక పండగలా ఉంటుంది' అని నిర్మాత రామ్ ఆచంట చెప్పారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ,'మహేష్ బాబు గారి సినిమాకి పని చేయడం స్పెషల్‌గా ఉంటుంది. 'దూకుడు, బిజినెస్ మ్యాన్' బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ గారితో చేస్తున్న ఈ సినిమా నాకు మరింత స్పెషల్‌గా మారిపోయింది' అని అన్నారు.
దర్శకుడు పరశురాంకి కథ ఓకే చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆయన నాకో మెసేజ్ పెట్టారు. 'ఒక్కడు' సినిమా చూసి డైరెక్టర్ అవుదామని వచ్చాను. మీరు అవకాశం ఇచ్చారు. ఈ సినిమా ఎలా తీస్తానో చూడండి' అని అన్నారు. ఆయన చెప్పినట్లే అద్భుతంగా తీశారు. నా ఫ్యాన్స్‌కి, నాన్న గారి అభిమానులకు పరశురాం ఒక అభిమాన దర్శకుడు అవుతారు. ఈ సినిమాలో చాలా హైలెట్స్ ఉన్నాయి. హీరో, హీరోయిన్ ట్రాక్ కోసం రిపీట్ ఆడియన్స్ వస్తారు.
- మహేష్‌బాబు