Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీకాంత్ గుర్రం, బుజ్జి (హేమలతా రెడ్డి) జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'నిన్నే చూస్తు'. కె.గోవర్ధనరావు దర్శకత్వంలో పోతిరెడ్డి హేమలతా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటీవలే సెన్సార్ పనులు పూర్తి చేసుకుని, ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా సీనియర్ నటులు సుమన్, సుహాసిని, భానుచందర్ మాట్లాడుతూ, 'యూత్ సినిమాలను తీస్తూ ,బోల్డ్ కంటెంట్‌కు ప్రాధాన్యత ఇస్తూ సొమ్ము చేసుకుంటున్న సినిమాలకు భిన్నంగా ఈ దర్శక, నిర్మాతలు మంచి కాన్సెప్ట్ ఉన్న కుటుంబ కథా చిత్రాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. వీరిని కచ్చితంగా అభినందించాల్సిందే. సినిమా బాగా వచ్చింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం' అని ఆన్నారు.
'కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా ప్రేమ ఎప్పుడూ ఓడిపోకూడదు అనే ఆలోచనతో, పెద్దలతోపాటు ప్రేమికులకు అర్థమయ్యే రీతిలో ఈ చిత్రాన్ని రూపొందించాం. సుహాసిని గారు మాకిచ్చిన చిన్న చిన్న టిప్స్ మా సినిమాకు ఎంతో ఉపయోగ పడ్డాయి. కోవిడ్ కారణంగా ఈ సినిమా డిలే అయ్యింది. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో డిఫరెంట్ ప్రమోషన్స్‌తో టీజర్, ట్రైలర్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం. మా సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకంతో ఉన్నాం' అని నిర్మాత హేమలతా రెడ్డి తెలిపారు.
దర్శకుడు కె. గోవర్ధనరావు మాట్లాడుతూ,'సుమన్, సుహాసిని, భానుచందర్, షియాజి షిండే మాతో కలిసిపోయి హ్యాపీగా పని చేశారు. అలాగే మాకేమైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా వాటిని క్లియర్ చేశారు. ప్రేమించే మనుషులు, మంచి మనసులు ఉన్నంత వరకు ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు అని చెప్పే ప్రయత్నాన్ని ఈ సినిమా ద్వారా చేశాం. నాకు ఇలాంటి మంచి ప్రేమకథా చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాత హేమలత రెడ్డి గారికి కతజ్ఞతలు' అని చెప్పారు. 'మంచి కంటెంట్ ఉన్న ఇలాంటి సినిమాలో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. మా పాత్రలు కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరిస్తాయి' అని నాయకానాయికలు అన్నారు.