Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కేజీఎఫ్'తో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఓ బ్రాండ్ ఇమేజ్ తెెచ్చుకుని, సంచలన రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తున్న రాక్ స్టార్ యష్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'రారాజు'.
కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని పద్మావతి పిక్చర్స్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 'కేజీఎఫ్2' వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత తెలుగులో వస్తున్న ఈ సినిమా గురించి సందర్భంగా నిర్మాత వి.ఎస్.సుబ్బారావు మాట్లాడుతూ, ''కేజీఎఫ్', 'కేజీఎఫ్2' వంటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్‌తో అటు కన్నడనాటతోపాటు యావత్ దేశ వ్యాప్తంగా యష్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అద్భుతమైన నటనా ప్రతిభతో తనకంటూ ప్రత్యేక అభిమాన గణాన్ని సైతం సొంతం చేసుకున్నారు. ఇంత క్రేజ్ సొంతం చేసుకున్న ఆయన చిత్రాన్ని మేం తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. యష్, అయన సతీమణి రాధిక పండిట్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రమిది. ఈ సినిమా కన్నడలో పెద్ద సక్సెస్ అయ్యింది. ఈ చిత్రాన్ని తెలుగులో 'రారాజు' పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలలో త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. రీసెంట్గా రిలీజైన 'కేజీఎఫ్2' సంచలన విజయంతో ఈ సినిమాపై కూడా అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు దీటుగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఈ సినిమా దర్శకుడు మహేష్‌రావు అత్యద్భుతంగా తెరకెక్కించారు. ట్రైలర్‌ను కూడా అతి త్వరలోనే రిలీజ్ చేస్తాం. తప్పకుండా ఈ సినిమా అందరినీ మెప్పిస్తుంది' అని అన్నారు. యష్, రాధిక పండిట్, కిక్ శ్యామ్, సీత, రవిశంకర్ తదితరులు నటించిన ఈచిత్రానికి మ్యూజిక్ : హరికష్ణ, డీ ఓ పి : ఆండ్రూ, నిర్మాత.. వి ఎస్ : సుబ్బారావు, డైరెక్టర్ : మహేష్ రావు.