Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విష్ణు మంచు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో 'గాలి నాగేశ్వరరావు' అనే మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు విష్ణు. పాయల్ రాజ్‌ఫుత్, సన్నీలియోన్ ఈ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఈ సినిమాలోని ఓ పాటకు కొరియోగ్రఫీ చేస్తుండటం ఈ సినిమాకి మరో హైలైట్. తాజాగా మరో స్పెషల్ ఎట్రాక్షన్ ఈ సినిమాకి యాడ్ అయ్యింది.
అదేంటంటే, విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా ఈ సినిమా ద్వారా సింగర్స్‌గా పరిచయం అవుతున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్న ఈ సినిమాలోని ఓ పాటను వీరిద్దరూ పాడటం విశేషం. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాట సినిమాకి కీలకంగా నిలవడంతోపాటు ప్రత్యేక ఆకర్షణగానూ నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు. సీనియర్ సినిమాటోగ్రాఫర్ చోటా.కె.నాయుడు పనితనం, భాను, నందు అందిస్తున్న డైలాగ్స్, అనూప్ రూబెన్స్ సంగీతం,. జి.నాగేశ్వరరెడ్డి మూల కథ.. ఇవన్నీ ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తాయని, త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నామని మేకర్స్ చెప్పారు.