Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్‌బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని మహేష్ బాబు సోమవారం విడుదల చేశారు.
2.28 నిమిషాల ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ,'సినిమా చూశాను. కొన్ని సీన్లు చూస్తున్నపుడు గూస్ బంప్స్ వచ్చాయి. చివరి
30 నిమిషాలు నా గొంతు తడారి పోయింది. సినిమా పూర్తయిన తరువాత ఏం మాట్లాడలేకపోయాను. రెండు నిమిషాల మౌనం తర్వాత శేష్‌ని హగ్ చేసుకున్నాను. రెండేళ్ళుగా ఈ టీమ్ నాకు థ్యాంక్స్ చెబుతోంది. కానీ ఇంత గొప్ప సినిమాని ఇచ్చిన ఈ టీమ్‌కి నేనే థ్యాంక్స్ చెప్పాలి. జూన్ 3న వస్తున్న ఈ సినిమా తప్పకుండా మీరు ప్రేమించే సినిమా అవుతుంది. నాలుగేళ్ళుగా నేను ఏది పట్టుకున్నా బ్లాక్ బస్టరే అవ్వడం హ్యాపీగా ఉంది' అని అన్నారు. దర్శకుడు శశి కిరణ్ తిక్క మాట్లాడుతూ,'2018లో అడవి శేష్ ఈ కథ చెప్పారు. నేను కూడా మేజర్ సందీప్ ఉన్నికష్ణన్ జీవితంపై రీసెర్చ్ చేశాను. ఇలాంటి గొప్ప కథ ఎలాగైనా చెప్పాలని నిర్ణయించుకున్నాను. మహేష్ గారు మా వెనుక ఉండటం ఒక ప్రత్యేకమైన బలం. నమ్రత గారు గ్రేట్ సపోర్ట్ ఇచ్చారు' అని తెలిపారు. కో-ప్రొడ్యుసర్ శరత్ మాట్లాడుతూ, 'అడవి శేష్ ఈ సినిమా కోసం ఇరవైనాలుగు గంటలు కష్టపడ్డారు. సోనీ పిక్చర్స్‌కి ప్రత్యేకంగా కతజ్ఞతలు చెప్పాలి. మహేష్ గారు చేసిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేం' అని చెప్పారు. ''బొమ్మరిల్లు' సినిమాకి మా నాన్నతో వెళ్లాను. అప్పుడే నిర్మాత అవుతానని నాన్నతో చెప్పా. ఇన్నాళ్ళ తర్వాత మహేష్ బాబుగారి లాంటి పెద్ద స్టార్‌తో సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం కావడం ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా మా జీవితాల్లో ఒక మైల్ స్టోన్‌గా నిలిచిపోతుందనే నమ్మకం వుంది. మేజర్ సందీప్ ఉన్నికష్ణన్కి ఈ చిత్రం ఘనమైన నివాళిగా ఉండబోతోంది' అని మరో సహ నిర్మాత అనురాగ్ అన్నారు.
ఓ సాధారణ మేజర్ సందీప్ ఒక అసాధారణ వ్యక్తిగా ఎలా అయ్యారనేది ఈ సినిమాలో చూస్తారు. మహేష్ గారు ఈ సినిమాకి బ్యాక్ బోన్. అబ్బూరి రవి గారికి స్పెషల్ థ్యాంక్స్. మేజర్ సందీప్ జ్ఞాపకాలు ఎప్పటిక్కీ నిలిచిపోవాలని ఆయన పేరెంట్స్ కోరుకున్నారు. ఈ సినిమా మేజర్ సందీప్ ఉన్నికష్ణన్ గురించి గొప్ప జ్ఞాపకంగా నిలిచిపోతుంది. సోనీ పిక్చర్స్ ఈ సినిమాని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. అనురాగ్, శరత్ అన్నదమ్ముల్లా తోడున్నారు. ఈ సినిమాని చాలా మందికి చూపించాం. మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం కూడా ఒక స్పెషల్ షోని ప్లాన్ చేస్తాం. ట్రైలర్‌తో దిమ్మతిరిగింది. సినిమా మీ హదయాన్ని తాకేలా ఉంటుంది.
- హీరో అడివి శేష్