Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న వైవిధ్యమైన చిత్రం 'విరాటపర్వం'. డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న
ఈ సినిమా జూలై 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా సాయి పల్లవి బర్త్ డే కానుగా.. 'సోల్ ఆఫ్ వెన్నెల' పేరుతో ఒక ప్రత్యేకమైన వీడియోని చిత్ర బృందం విడుదల చేసింది.
'వెన్నెల రెండుసార్లు జన్మించింది.. తొలిపొద్దులో ఇప్పపూలు పూసినట్టు.. అడవి తల్లి ఒడిలో ఒకసారి..ఆశయాన్ని ఆయుధం చేసినట్టు..అతని ప్రేమలో మరొకసారి.. ఇలా సాయి పల్లవి పోషించిన వెన్నెల పాత్ర గురించి దర్శకుడు వేణు ఊడుగుల రాసిన ఈ మాటలు వెన్నెల పాత్రపై మరింత ఆసక్తిని పెంచాయి. 'నిర్బంధాలని కౌగలించుకున్న వసంతకాలం మనది. రేపు మనం ఉన్నా లేకపోయిన చరిత్ర ఉంటుంది, మన ప్రేమ కథని వినిపిస్తుంది అని సాయి పల్లవి వాయిస్‌లో చివర్లో వినిపించిన ఈ మాటలు కవితాత్మకంగా ఉండటంతో పాటు ప్రేమకథలోని లోతుని, గొప్పదనాన్ని వెల్లడిస్తున్నాయి. ఈ స్పెషల్ వీడియోలో చూపించిన విజువల్స్ సాయిపల్లవి పాత్రలో వైవిధ్యాన్ని ప్రజెంట్ చేశాయి. సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది' అని చిత్ర బృందం పేర్కొంది.