Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'లైగర్'. 'సాలా క్రాస్‌బ్రీడ్' అనేది ఉప శీర్షిక.
సోమవారం విజరు దేవరకొండ పుట్టినరోజుని పురస్కరించుకుని చిత్ర యూనిట్ 'లైగర్ హంట్ థీమ్' లిరికల్ వీడియోను విడుదల చేసింది.
ఈ హంట్ థీమ్‌ని విక్రమ్ మాంట్రోస్ కంపోజ్ చేయగా, హేమచంద్ర ఫుల్ ఎనర్జీటిక్గా పాడారు. 'బతకాలంటే గెలవాల్సిందే.. ఎగరాలంటే రగలాల్సిందే.. నువ్వు పుట్టిందే గెలిచేందుకు.. ఛల్ లైగర్.. హంట్..' అంటూ గీత రచియత భాస్కరభట్ల రాసిన ఈ మాటలు ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి. విడుదలైన కొద్ది క్షణాల్లోనే 'లైగర్ హంట్ థీమ్' సినిమాపై అంచనాలని పెంచింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందీ చిత్రం. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది' అని చిత్ర యూనిట్ పేర్కొంది. విజరు దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయికగా నటిస్తుండగా, లెజండరీ బాక్సర్ మైక్ టైసన్ భారతీయ వెండితెరకు పరిచయం అవుతున్నారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ప్రస్తుతం కశ్మీర్లో షూటింగ్ జరుపుకుంటోంది. సోమవారం విజయ్ దేవరకొండ బర్త్‌డే వేడుకను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఈనెల 16న రిలీజ్ చేయబోతున్నారు.