Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. జీ స్టూడియోస్ సమర్పణ, నిర్మాణంలో హాస్య మూవీస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎ.ఆర్.మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండు నిర్మాత. బాలాజీ గుత్త సహ నిర్మాత. ఆనంది హీరోయిన్గా నటిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
'పోస్టర్లో నరేష్ నెత్తురోడుతున్న గాయాలతో ఓ నులక మంచాన్ని భుజాలపై మోస్తూ కనిపిస్తున్నారు. ఈ ఇన్టెన్స్ లుక్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది. గతంలో ఎన్నడూ చూడని నరేష్‌గారిని చూడబోతున్నారు. భిన్న టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఆయన కెరీర్లోనే ది బెస్ట్ సినిమాగా నిలువనుంది. సినిమా చిత్రీకరణ ఏకధాటిగా నిర్వహిస్తున్నాం' అని మేకర్స్ తెలిపారు.
వెన్నెల కిషోర్, ప్రవీణ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీత సారథ్యం వహిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, ఛోటా కె.ప్రసాద్ ఎడిటర్‌గా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా, యాక్షన్ డైరెక్టర్‌గా పథ్వి బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు.