Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''సర్కారు వారి పాట' సినిమా క్రెడిట్ మొత్తం దర్శకుడు పరశురాంకి దక్కుతుంది. నా పాత్రని చాలా కొత్తగా డిజైన్ చేశారు. చాలా ఎంజారు చేస్తూ, పని చేశాను. 'పోకిరి' రోజులు గుర్తుకు వచ్చాయి' అని హీరో మహేష్‌బాబు చెప్పారు.
మహేష్ బాబు, పరశురాం కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ చంద్ ఆచంట నిర్మించిన ఈ భారీ చిత్రం ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపధ్యంలో మహేష్ బాబు మంగళవారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాల సమాహారం..
- ఈ చిత్రాన్ని 'పోకిరి' సినిమాతో పోల్చడానికి కారణం ఏంటంటే, ఇందులోని క్యారెక్టర్ 'పోకిరి' మీటర్లో ఉంటుంది. 'పోకిరి' చూస్తే థియేటర్లో ఒక మాస్ ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి క్యారెక్టర్ మళ్ళీ ఈ సినిమాతో కుదరటం హ్యాపీగా ఉంది.
- పరాశురాం గారు అద్భుతమై రచయిత. రచయిత దర్శకుడైతే సినిమా అద్భుతంగా ఉంటుంది. ఈ కథని ఆయన డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. కథ ఫస్ట్ హాఫ్‌లో యుఎస్ లో మొదలై, సెకండ్ హాఫ్ వైజాగ్‌కి వస్తుంది. ఈ మధ్యలో ఏం జరిగింది అనేది మాటల్లో కంటే వెండితెరపై చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. సినిమాని అందరూ మళ్ళీ మళ్ళీ చూసేలా ఉంటుంది.
- ప్రీ రిలీజ్ వేడుకలో కీర్తి సురేష్ నా గ్లామర్, టైమింగ్‌ని మ్యాచ్ చేయలేనని చెప్పారు. వేడుకలో కీర్తి సురేష్ అలా చెప్పింది. కానీ సినిమాలో ఇరగదీసింది. ఇందులో కీర్తి పాత్ర చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. లవ్ ట్రాక్ మెయిన్ హైలెట్. ప్రేక్షకులు బాగా ఎంజారు చేస్తారు.
- తమన్ ఈ సినిమాకి కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. 'కళావతి..' పాట నా కెరీర్ లోనే బెస్ట్ సాంగ్‌గా నిలిచింది. రీరికార్డింగ్ కూడా అదరగొట్టాడు. రామ్ లక్ష్మణ్ నా ఫేవరేట్ మాస్టర్స్. ప్రతి సినిమాని కొత్తగా డిజైన్ చేస్తారు.
మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ నిర్మాతలతో నాకు 'దూకుడు', 'శ్రీమంతుడు' లాంటి బ్లాక్‌బస్టర్స్ ఉన్నాయి. లాక్‌డౌన్‌లోనూ ఎక్కడా రాజీపడకుండా సినిమాని భారీగా నిర్మించారు. ఆలాంటి నిర్మాతలతో వర్క్ చేయడం గొప్ప అనుభవం.
- పాన్ ఇండియా సినిమాలు చేసే ఆలోచన లేదు. మన తెలుగు సినిమానే బాలీవుడ్‌కి రీచ్ కావాలని కోరుకుంటాను. అయితే నేను, రాజమౌళి గారు సినిమా చేస్తే, అది కచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలోనే ఉంటుంది.
- నాన్నగారి బయోపిక్ చేయాలనే ఆలోచన లేదు. ఆయన నాకు దేవుడితో సమానం. ఆయన బయోపిక్‌లో నేను నటించలేను.
- చాలా గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో సినిమా చేస్తుండటం హ్యాపీగా ఉంది. ఈ సినిమా చాలా కొత్తగా ఉండ బోతుంది. మా కాంబినేషన్ అంటేనే డిఫరెంట్ లెవల్ ఉంటుంది. ఆయన అద్భుతమైన రచయిత. ఆయన రాసిన డైలాగ్స్‌ని నేను పలుకుతుంటే ఆ కిక్కే వేరు. ఆయన సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచుస్తున్నా.