Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన ఫన్ ఫ్రాంచైజీ 'ఎఫ్3' ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి భారీ స్పందన లభించిన నేపథ్యంలో ట్రైలర్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా వెెంకటేష్ మాట్లాడుతూ,'ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 'ఎఫ్ 2' కంటే 'ఎఫ్ 3'తో రెట్టింపు నవ్వులు పంచాలని ఈ సినిమా చేశాం. దిల్ రాజు, శిరీష్, అనిల్ రావిపూడి వండర్ ఫుల్ స్క్రిప్ట్‌తో వచ్చారు. ఫ్యామిలీ అంతా కలసివచ్చి ఎంజారు చేసే సినిమా ఇది' అని తెలిపారు.
''ఎఫ్2' మాకు ప్రాక్టీస్ మ్యాచ్ లాంటింది. 'ఎఫ్ 3' మెయిన్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో సిక్స్ కాదు బాల్ స్టేడియం బయటికి వెళుతుంది. కోవిడ్ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. కానీ మనందరికీ నవ్వులు తీసుకొచ్చే చిత్రం మాత్రం ఇదే. ట్రైలర్లో చూపించింది సినిమాలో ఒక్క శాతం మాత్రమే. సినిమాలో డబుల్ ఫన్ ఉంటుంది' అని వరుణ్ తేజ్ అన్నారు.
తమన్నా మాట్లాడుతూ, 'ఈ సినిమా ట్రైలర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా ఉంది. అనిల్ రావిపూడి గారు వన్ మ్యాన్ ఆర్మీ. ఇందులో అద్భుతమైన పాత్ర ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన దిల్ రాజు, శిరీష్ గారికి థ్యాంక్స్' అని అన్నారు.
'ఈనెల 27న ఈ సినిమా మీ ముందుకొస్తుంది. సినిమాని ఎంజారు చేసి పెద్ద బ్లాక్ బస్టర్ విజయం ఇవ్వాలని కోరుతున్నాను' అని మరో నాయిక మెహ్రీన్ తెలిపారు. హీరోయిన్ సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ,'నాకు ఈ సినిమాలో అద్భుతమైన పాత్ర ఇచ్చారు. ట్రైలర్‌కు గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఇంకా ఫన్ ఫుల్‌గా ఉంటుంది' అని తెలిపారు.
ట్రైలర్‌కు భారీ స్పందన రావడం గ్రేట్ ఎనర్జీ ఇచ్చింది. 'ఎఫ్2' కి మించి ఈ సినిమాని ఎంజారు చేయబోతున్నారు. ఈ సినిమాని మీరు ఆదరిస్తే 'ఎఫ్4' తీయడానికి కూడా రెడీ. వెంకటేష్ గారు ఎంటర్టైనర్స్ చేయడంలో ఎవరెస్ట్. వరుణ్ తేజ్ గారి ఫన్ టైమింగ్ అదిరిపోతుంది. తమన్నా, సోనాల్‌కి సంబంధించి ఒక సర్ప్రైజ్ ఉంది. అది థియేటర్లో చూస్తేనే తెలుస్తుంది. మా నిర్మాత శిరీష్ గారు ఇప్పటికే సినిమాని 20 సార్లు చూసి ఉంటారు. ఎప్పుడు చూసినా ఫస్ట్ టైం చూసినట్లే తెగ నవ్వుకుంటారు. ట్రైలర్ చూసి ఎంత నవ్వుకున్నారో, సినిమా చూసి అంతకు మించి నవ్వుకుంటారు.
- దర్శకుడు అనిల్ రావిపూడి