Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ఎల్ఎస్ మూవీస్ పతాకంపై రంజిత్, సౌమ్య మీనన్ జంటగా రూపొందుతున్న చిత్రం 'లెహరాయి'. 'ధర్మపురి' చిత్రంతో ఇటీవల హీరోగా పరిచయమైన గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామకష్ణ పరమహంసని దర్శకుడిగా పరిచయం చేస్తూ, మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రమిది. చిత్రీకరణ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ఈ సినిమా జరుపుకుంటోంది. ఈ చిత్రంతో సంగీత దర్శకుడు ఘంటాడి కష్ణ (జికే) సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇందులో ఉన్న 7 పాటల్ని ఇప్పటి జనరేషన్‌కి తగ్గట్టుగా కంపోజ్ చేశారు. గత వారం 'గుప్పెడంత గుండెల్లోన ఉంటావే..' అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ప్రోమోని రిలీజ్ చేస్తే, దానికి చాలా మంచి రెస్సాన్స్ వచ్చింది. ఇప్పుడు దీని లిరికల్ ఫుల్ సాంగ్‌ని యువ కథానాయకుడు కార్తికేయ విడుదల చేశారు' అని చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ,'ఈ చిత్రంలోని మొదటి సాంగ్ చూసాను. చాలా క్యాచీ లిరిక్స్‌తో హమ్మింగ్ ట్యూన్‌తో బాగుంది. ఈ సాంగ్ మంచి విజయాన్ని సాధించాలని కొరుకుంటున్నాను' అని చెప్పారు.
''లెహరాయి' అని ఎనౌన్స్ చేసిన టైైటిల్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మా మొదటి సాంగ్‌ని యువ హీరో కార్తికేయ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సాంగ్‌ని జీకే గారు ఆయన స్థాయిక సాంగ్స్‌కి ఏ మాత్రం తగ్గకుండా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను జావేద్ ఆలి అద్భుతంగా పాడారు. ట్యూన్‌కి చక్కటి లిరిక్స్ కుదరడంతో ఈ సాంగ్ యూత్‌ని బాగా అలరిస్తోంది' అని నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్ అన్నారు.
దర్శకుడు రామకష్ణ పరమహంస మాట్లాడుతూ,'ఈ లేటెస్ట్ సాంగ్‌తో జీకే గారి మ్యూజిక్ మళ్ళీ మ్యాజిక్‌ని రిపీట్ చేస్తుంది. ఈ చిత్రంలో ఉన్న ప్రతి సాంగ్ అందర్నీ అలరించే విధంగా ఉంటుంది. మంచి ఫీల్ ఉన్న కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని తెలిపారు.