Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధీర్‌బాబు కథానాయకుడిగా హర్షవర్ధన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి ప్రొడక్షన్ నెం.5గా నారాయణదాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తుండగా, సోనాలి నారంగ్, సష్టి సెల్యులాయిడ్ సమర్పణలో ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లోనూ తెరకెక్కుతోంది.
బుధవారం సుధీర్ బాబు పుట్టినరోజుని పురస్కరించుకుని మేకర్స్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. తన టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్, డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో తెలుగు ప్రేక్షకులనే కాకుండా బాలీవుడ్‌ని సైతం ఆకట్టుకున్న సుధీర్‌బాబుకు 'నైట్రో స్టార్' ట్యాగ్ ఇవ్వడం బర్త్‌డే స్పెషల్ కానుకగా ఆయన అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.
'ఈ చిత్రానికి 'మామా మశ్చీంద్ర' అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. మశ్చీంద్ర అనే పదానికి .. పవర్‌ని కోరుకునేవాడు, ధైర్యవంతుడనే అర్థాలు ఉన్నాయి. ఈ టైటిల్ సినిమాలో నైట్రో స్టార్ సుధీర్ బాబు పాత్రని ప్రతిబింబిస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో ఒక రాక్ స్టార్లా ఎనర్జిటిక్‌గా సుధీర్ బాబు కనిపిస్తున్నారు. ఆయన తీరు చూస్తుంటే ఇందులో ఆయన ఓ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నారని వేరే చెప్పక్కర్లేదు. మునుపెన్నడూ చూడని మల్టీ షేడ్ క్యారెక్టర్లో సుధీర్ బాబుని దర్శకుడు హర్షవర్ధన్ చూపించబోతున్నారు. వినూత్నమైన కాన్సెప్ట్‌తో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తుండగా, అత్యున్నత టెక్నికల్ టీం పని చేస్తోంది.ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఎప్పటికప్పుడు ప్రేక్షకులు, సుధీర్‌బాబు అభిమానులతో షేర్ చేసుకుంటామని మేకర్స్ తెలిపారు' అని చిత్ర బృందం చెప్పింది. ఈ చిత్రానికి రచయిత, దర్శకత్వం: హర్షవర్ధన్, నిర్మాతలు: నారాయణదాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సమర్పణ: సోనాలి నారంగ్, సష్టి (సష్టి సెల్యులాయిడ్), సంగీతం: చేతన్ భరద్వాజ్, డీవోపీ: పీజీ విందా, ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్.