Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'ఎఫ్3' ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. తమన్నా, మెహ్రీన్ నాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని ఈనెల 27న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. 'తాజాగా విడుదలైన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ఫన్ బ్లాస్ట్గా నిలిచింది. విడుదలైన 24 గంటలో 12.5 మిలియన్ వ్యూస్‌తో రికార్డ్ సష్టించి, యుట్యూబ్ టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా సాగిన ఈ ట్రైలర్‌లోని సర్ప్రైజ్లు అందర్నీ అలరించాయి. దీనికి మించిన సర్ప్రైజ్లు సినిమాలో చాలా ఉన్నాయి. ఈ సర్ప్రైజ్ ఇచ్చే ఎలిమెంట్స్‌లో తమన్నా చేసిన హారిక పాత్ర ఒక మేజర్ హైలెట్‌గా నిలుస్తుంది. 'ఎఫ్3' కథని మలుపు తిప్పే పాత్రలో తమన్నా కనిపించనుంది. 'ఎఫ్ 2'కు మించి హారిక పాత్రని అద్భుతంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాలో డిజైన్ చేశారు. ఈ కథ మొత్తం హారిక పాత్ర చుట్టూ తిరుగుతుంటుంది. నటనకి మంచి స్కోప్ ఉన్న హారిక పాత్రలో తమన్నా నటన నెక్స్ట్ లెవల్లో ఉంటూ అందర్నీ ఫిదా చేస్తుంది. ఈనెల 27న థియేటర్లలో నవ్వుల వర్షం కురవటం ఖాయం' అని చెప్పారు.