Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బి.ఎస్.రాజు సమర్పణలో ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సంపూర్ణేష్ బాబు, సోనాక్షి జంటగా రూపొందుతున్న చిత్రం 'ధగడ్ సాంబ'. ఎన్.ఆర్.రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఆర్.ఆర్. బి.హెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. హీరో సంపూర్ణేష్‌బాబు బర్త్‌డే నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ, 'ఉదయం నుంచి సాయంత్రం ఇంటికి వెళ్లేవరకు ప్రతి ఒక్కరు ఎంతో టెన్షన్‌కు గురవుతున్నారు. అలాంటి వారికి సంపూర్ణేష్ బాబు సినిమా గొప్ప రిలీఫ్ ఇస్తుంది. రెండున్నర గంటలు పాటు హాయిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా ట్రైలర్ బాగుంది. ఇందులో మంచి ఫీల్ కలిగే సీన్స్ చాలా ఉన్నాయి. యాక్షన్ కూడా బాగా చేశాడు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించాలని ఆశిస్తున్నాను' అని తెలిపారు.
దర్శకుడు యన్.ఆర్.రెడ్డి మాట్లాడుతూ,'సంపూ ఈ సినిమాలో కామెడీ, సెంటిమెంట్‌తో పాటు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ ఫైట్స్ కూడా చాలా బాగా చేశారు. ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తైతే ఈ సినిమా సంపూ గారి కెరీర్లో ది బెస్ట్ సినిమా అవుతుంది' అని చెప్పారు.
'సంపూర్ణేష్ బాబు తనదైన శైలిలో అద్భుతంగా చేశారు. ఈ సినిమాలో సంపూని సరికొత్తగా చూస్తారు. హీరోయిన్ సోనాక్షి నటన అదనపు ఆకర్షణ కానుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని రెండున్నర గంటలపాటు నవ్వించే చిత్రమిది' అని నిర్మాత ఆర్ ఆర్.బి.హెచ్. శ్రీనుకుమార్ రాజు అన్నారు.