Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న విషయం విదితమే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజరు సరసన రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విజరు 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
'విజరు, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లోను, ఇటు విజరు అభిమానుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు దీటుగా మా సినిమా ఉండబోతోంది' అని మేకర్స్ తెలిపారు.
శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం: వంశీ పైడిపల్లి, కథ, స్క్రీన్ ప్లే: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్, సహ నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత, సంగీతం: ఎస్ఎస్ తమన్, డీవోపీ: కార్తీక్ పళని, ఎడిటింగ్: కెఎల్ ప్రవీణ్, డైలాగ్స్, అడిషనల్ స్క్రీన్ ప్లే: వివేక్, ప్రొడక్షన్ డిజైనర్లు: సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి, ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: బి శ్రీధర్ రావు, ఆర్ ఉదరు కుమార్.