Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర నిర్మాత ఎం.ఎస్.రాజు తాజాగా ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కు తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని ఎం.ఎస్.రాజు పుట్టినరోజు సందర్బంగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి 'సతి' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. కొత్తగా పెళ్ళైన భార్య భర్తల మధ్య జరిగే అనుకోని సంఘటనల చుట్టూ అల్లిన కథ ఇది. ఉద్వేగభరితమైన సన్నివేశాలతో ఈ సినిమా రూపొందుతోందని, తన దర్శకత్వ కేరీర్‌లోనే గర్వంగా చెప్పుకోదగ్గ చిత్రమవుతుందని ఎం.ఎస్.రాజు తెలిపారు. సీనియర్ నటులు డా.నరేష్ ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్, రఘురామ్ .టి, సారంగ సురేష్ కుమార్, డా. రవి దాట్ల ఈ చిత్రాన్ని వైల్డ్ హనీ ప్రొడక్షన్, రమంత్ర క్రియేషన్స్ బ్యానర్స్‌లో నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాకేష్ హాసమని, వెంకట్, ఎడిటర్: జునైద్ సిద్దికి, సహ-నిర్మాత: జె.శ్రీనివాస రాజు, సమర్పణ: సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్, కథ - దర్శకత్వం: ఎం.ఎస్.రాజు.