Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కరోనా వంటి విపత్కర పరిస్థితి తర్వాత సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమాగా మా 'అశోకవనంలో అర్జునకళ్యాణం' ఉందని ప్రేక్షకులు, సినీ విశ్లేషకులు అభినందించడం చాలా ఆనందంగా ఉంది. ఓ మంచి సినిమాని నిర్మించినందుకు గర్వపడుతున్నాం' అని మేకర్స్ చెప్పారు.
విశ్వక్సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా తెరకెక్కిన చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం'. ఈ సినిమా ఈనెల 6న విడుదలైంది. చక్కటి రివ్యూలు, పాజిటివ్ మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తూ, మంచి కలెక్షన్లను రాబడుతోందీ చిత్రం. సిట్చ్యువేషనల్ కామెడీ, లవ్ ఎమోషన్స్, పర్ఫెక్ట్ ఫ్యామిలీ సెంటిమెంట్స్‌తో కూడిన సినిమాగా ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. సినిమా విడుదలై వారం రోజులు అయినా ఇంకా హౌస్‌ఫుల్ కలెక్షన్లు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. రెండో వారంలోనూ ఎక్కువ థియేటర్లతో సినిమా రన్ అవుతోంది. తనకు నచ్చిన అమ్మాయి మనసుకు దగ్గరవ్వాలని 33 ఏళ్ల యువకుడు నిజాయతీగా చేసిన ప్రయత్నంగా ఈ సినిమాకు స్పెషల్ అప్లాజ్ వస్తోంది. తనకున్న మాస్ ఇమేజ్‌ని పక్కనపెట్టి, బరువు పెరిగి క్యారెక్టర్లో లీనమై విశ్వక్సేన్ నటించిన తీరుకు, డైరెక్టర్ విద్యాసాగర్ చింత ప్రయత్నానికి ప్రశంసలు దక్కుతున్నాయి. రవికిరణ్ కోలా రాసిన కథలో సెన్సిటివ్ ఎలిమెంట్స్‌కి యూత్ ప్లస్ ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. జై క్రిష్ కంపోజ్ చేసిన మ్యూజిక్ సక్సెస్‌లో కీలక భాగమైంది' అని మేకర్స్ చెప్పారు.