Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్.ఎస్.నాగేశ్వరరావు నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న వినూత్న చిత్రం 'నటరత్నాలు'. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి.
అతిత్వరలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. గాదె నాగభూషణం దర్శకుడు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ నర్రా శివ నాగు వహిస్తుండగా, ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆనందాసు శ్రీ మణికంఠ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుదర్శన్, 'రంగస్థలం' మహేష్, అర్జున్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రంలో డా భద్రం, తమిళ నటుడు శేషాద్రి తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
'అన్ని వర్గాల ప్రేక్షకులను కనెక్ట్ చేసేలా క్రైం, థ్రిల్లర్, మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమాను మేకర్స్ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో కామెడీ పార్ట్‌ని హైలైట్ చేస్తూ, ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జూన్ మొదటివారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభించనున్నారు. సన్నివేశాలకు తగిన లొకేషన్స్ ఎంచుకుని, ఎక్కడా రాజీ పడకుండా చాలా గ్రాండ్‌గా ఈ సినిమాని కంప్లీట్ చేయాలనే సంకల్పంతో దర్శక,నిర్మాతలు ఉన్నారు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు వినూత్న అనుభూతి కలిగిస్తుందనే దీమాని మేకర్స్ ఉన్నారు' అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి ఎడిటర్: ఆవుల వెంకటేష్, కెమెరా: గిరి కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : నాగ మధు.