Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్, వరుణ్‌తేజ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'ఎఫ్3'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ఈ సినిమా నెల 27న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇందులో ఓ కీలక పాత్ర పోషించిన
సునీల్ శనివారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
'ఎఫ్3'లో వింటేజ్ సునీల్‌ని చూస్తారు. నా పాత్ర సినిమా అంతా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో ఎక్కువ సోలో పెర్ఫార్మెన్స్కి అవకాశం ఉంటే, సెకండ్ హాఫ్ వచ్చేసరికి గ్రూప్ కామెడీగా ఉంటుంది. అందరం చేసే కామెడీ మాములుగా ఉండదు. నాన్ స్టాప్ నవ్వులే. 'ఎఫ్ 2'కి మించిన ఫన్ ఇందులో ఉంటుంది. ఈ నవ్వుల కోసం ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ థియేటర్లకు రావడం ఖాయం.
వెంకటేష్‌గారు 'ఎఫ్3' షోని స్టీల్ చేశారు. వరుణ్‌తేజ్ ఫస్ట్‌టైమ్ పూర్తిస్థాయిలో కామెడీ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడిగారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అనిల్‌లో గ్రేట్ ఆర్టిస్ట్ ఉన్నాడు. అతనే చేసి చూపిస్తాడు.
'ఎఫ్ 3', 'పుష్ప' ఒకే సమయంలో షూటింగ్స్‌లో పాల్గొన్నా.రెండూ డిఫరెంట్ రోల్స్. ఒకటి కామెడీ, రెండోది విలనీ. పొద్దున కామెడీ చేసి, రాత్రికి విలనీ చేయడం బాగా ఛాలెజింగ్‌గా అనిపించింది. ఈ సినిమాతో ప్రేక్షకులు పాత సునీల్‌ని చూస్తారు. 'పుష్ప' సినిమా నాలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. 'పుష్ప2'లో కూడా నా పాత్రని దర్శకుడు సుకుమార్‌గారు అత్యద్భుతంగా డిజైన్ చేశారు. 'పుష్ప' రిలీజ్ తర్వాత తమిళం, కన్నడ, బాలీవుడ్ నుంచి విలన్ పాత్రల కోసం సంప్రదించారు. అలాగే బాలీవుడ్ నుంచి కొన్ని కామెడీ రోల్స్ కూడా ఆఫర్స్ వచ్చాయి. రెండు ఓకే చేశా. త్వరలోనే వాటి వివరాలు తెలియజేస్తాను.
త్రివిక్రమ్ కొత్త సినిమాలో నేను ఉంటాను. అవకాశం ఉన్న ప్రతి చోటా నన్ను పెట్టాలని ప్రయత్నిస్తుంటారు. ఆఖరికి 'భీమ్లా నాయక్' సాంగ్‌లో కూడా పెట్టారు (నవ్వుతూ). ప్రస్తుతం చిరంజీవి గారి 'గాడ్ ఫాదర్', రామ్ చరణ్, శంకర్ సినిమా, మరో 13 చిన్న, మీడియం సినిమాలు కూడా ఉన్నాయి. ఎలాంటి పాత్ర అయినా సరే చేయటానికి రెడీగా ఉన్నా. అలాగే అందరికీ అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నా. నేను కామెడీ చేసినా, హీరోగా, విలన్‌గా చేసినా ప్రేక్షకులు ఆదరించడం వల్లే 25 ఏళ్ళు నటుడిగా చిత్ర పరిశ్రమలో రాణించగలిగాను.