Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మనం' లాంటి ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్ తరువాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌కుమార్ కలయికలో రాబోతున్న మరో చిత్రం 'థ్యాంక్యూ'. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలుగా నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని జూలై 8న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో నాగచైతన్య కూల్ అండ్ స్టయిలిష్ లుక్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.
'నాగచైతన్య కెరీర్లో మరపురాని చిత్రంగా నిలిచిపోయేలా ఈ సినిమా ఉంటుంది. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరించే దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ సినిమాతోనూ అందర్నీ సర్ప్రైజ్ చేయబోతున్నారు. ఓ మంచి కాన్సెప్ట్‌తో ఆయన ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. నాయికలు రాశీఖన్నా, మాళవిక నాయర్ నటన ఫిదా చేస్తుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ దిల్‌రాజు, శిరీష్ ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమా ఫలితంపై మంచి నమ్మకంతో ఉన్నారు. లెజండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరు స్తున్నారు. బీవీఎస్ రవి కథ అందించిన ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విశేషాలను మేకర్స్ షేర్ చేసుకోనున్నారు' అని చిత్ర యూనిట్ తెలిపింది.