Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'ఎఫ్3'. తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అదనపు ఆకర్షణగా పూజా హెగ్డే పార్టీ సాంగ్‌లో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయనుంది. ఈ నేపథ్యంలో ఈనెల 17న పూజా హెగ్డే మెరిసిన ''లైఫ్ అంటే ఇట్లా ఉండాలా'' పాటను రిలీజ్ చేయబోతున్నారు. దీని కోసమై నేడు (సోమవారం) ఈ పాట ప్రోమోను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ పర్ఫెక్ట్ పార్టీ పోస్టర్‌గా నిలిచింది. పూజా హెగ్డే, వెంకటేష్, వరుణ్ తేజ్ జిగేల్ మనిపించే పార్టీవేర్‌లో కనిపించారు. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్స్‌లో స్పెషల్ పార్టీ సాంగ్‌కి తగ్గట్టు మెరవటం విశేషం.
సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ పార్టీ సాంగ్ కోసం క్యాచీ, గ్రూఫ్ నెంబర్ని ట్యూన్ చేసారు. ఈ పార్టీ సాంగ్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణలలో ఒకటిగా ఉండబోతుంది. 'ఎఫ్3' స్టార్ కాస్ట్ అంతా కనిపించేబోయే ఈ పాట ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ కానుంది. అలాగే పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవుతుందనే దీమాని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.
ఈ పార్టీ సాంగ్‌ని ప్రకటించినప్పటి నుంచి అందరిలోనూ ఆసక్తి పెరిగింది. లిరికల్ వీడియోను విడుదల చేయడానికి ముందు పోస్టర్, ప్రోమోలను విడుదల చేస్తూ ఆ ఆసక్తిని మరింత పెంచింది చిత్ర యూనిట్. గతవారం విడుదలైన 'ఎఫ్ 3' ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తోంది. 20 మిలియన్లకు పైగా వ్యూస్‌తో గత 6 రోజులుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. 'ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్‌తేజ్‌తోపాటు సునీల్ చేసే సందడి అందర్నీ కడుపుబ్బా నవ్విస్తుంది. తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్, పూజా హెగ్డేల అందం, అభినయం ఈ చిత్రానికి హైలెట్ కానున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ' ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీగా విడుదల కానుంది. 'ఎఫ్2'ని మించి వినోదం అందించడం ఖాయమని, అలాగే 'ఎఫ్2'ని మించి ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకంతోనూ ఉన్నామని దర్శక, నిర్మాతలు తెలిపారు.