Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అశ్విన్ బాబు హీరోగా అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'హిడింబ'. ఎస్వీకే సినిమాస్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఈ చిత్రంలో అశ్విన్ బాబుకు జోడిగా నందితా శ్వేత నాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ఆదివారం రిలీజ్ అయ్యింది. విడుదలైన కొద్ది క్షణాల్లోనే ప్రేక్షకుల విశేష ఆదరణతో ఈ గ్లింప్స్ వైరల్ అయ్యింది.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'ఫస్ట్ గ్లింప్స్‌లో యాక్షన్ అదిరిపోయింది. అశ్విన్ బాబు రౌడీలని కొడుతున్న ఫైట్ సీక్వెన్స్ టెర్రిఫిక్‌గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయి. అశ్విన్ బాబుని పవర్ ఫుల్ పాత్రలో దర్శకుడు అనీల్ కన్నెగంటి చూపించారు. ఈ చిత్రంతో అశ్విన్బాబుకి మరింత మంచి గుర్తింపు లభిస్తుంది. నందితా శ్వేత పోలీస్‌గా కనిపించింది. సుభలేఖ సుధాకర్ రాజకీయ నాయకుడిగా కనిపించారు. ఫస్ట్ గ్లింప్స్‌తోనే ఈ సినిమా అందరిలోనూ క్యూరియాసిటీని పెంచింది. ఓ వినూత్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు' అని చెప్పారు. ఈ చిత్రానికి దర్శకత్వం : అనీల్ కన్నెగంటి, నిర్మాత: గంగపట్నం శ్రీధర్, సంగీతం: వికాస్ బాడిసా, డీవోపీ: రాజశేఖర్ బి.