Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజశేఖర్ హీరోగా ప్రకాష్ రాజ్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర నటీనటులుగా రూపొందిన చిత్రం 'శేఖర్'.
వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.
బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని వెంకట సాయి ఫిల్మ్ బ్యానర్లో ముత్యాల రాందాస్ ఇండియా వైడ్‌గా విడుదల చేస్తుండగా, నిర్వాణ సినిమాస్ సజన ఎరబోలు ఓవర్సీస్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఈనెల 20న విడుదలవుతున్న సందర్భంగా దర్శకురాలు జీవిత రాజశేఖర్ ఆదివారం మీడియాతో ముచ్చటించారు.
- తమిళంలో సూపర్ హిట్ అయిన ట్రూ స్టోరీ 'శేషు' తెలుగు రీమేక్‌కి అనుకోకుండా ఎలా దర్శకురాలిని అయ్యానో.. ఈ సినిమాకి కూడా అదే పరిస్థితి రావడంతో డైరెక్ట్ చేశా.
- మలయాళంలో సూపర్ హిట్ అయిన 'జోసెఫ్' సినిమా మాకు నచ్చడంతో తెలుగు రైట్స్ తీసుకున్నాం. ఈ సినిమాను 'శేఖర్' పేరుతో తీయాలని 'పలాస' డైరెక్టర్, నీలకంఠ గారిని కలిశాం. వారు బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాకి కూడా నేనే దర్శకత్వం వహించాల్సి వచ్చింది.
చాలా రియలిస్టిక్‌గా తీసిన సినిమా ఇది. ఎవరు ఊహించని విధంగా ఉంటుంది. ఇందులో రాజశేఖర్‌గారి లుక్కు మంచి అప్లాజ్ వచ్చింది ప్రతి వ్యక్తి లైఫ్‌లో వాళ్లు చాలా ఇష్టపడే వ్యక్తి ఒకరు ఉంటారు. తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న ఇలా ఎవరైనా అవ్వొచ్చు. అటువంటివారెవరూ లేకుండా సింగిల్‌గా మిగిలి పోతే తన మైండ్, ఎమోషన్ ఎలా ఉంటుంది?, తన పక్కన ఎవరూ లేకున్నా కామన్‌గా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నాడు అనేదే ఈ సినిమా.హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా టచ్ అవుతుంది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో 'శేఖర్' ఉంటాడు అనేలా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఇందులో రాజశేఖర్ గారు, శివాని ఇద్దరూ అద్భుతంగా నటించారు.
- మేం 'గోరింటాకు' తీసినప్పుడు కూడా ఆ సినిమాను యాక్సెప్ట్ చేస్తారా అనుకున్నాం. కానీ.. ఆ సినిమా సెంటిమెంటు పరంగా చాలా బిగ్ హిట్ అయింది. ఆ ధైర్యంతోనే ఈ సినిమా చేశాం. ఈ సినిమాను తెలుగులో మాత్రమే కొన్నాం. కాబట్టి తెలుగులోనే రిలీజ్ చేస్తున్నాం. మంచి ఆఫర్ వస్తే ఓటిటిల్లో కూడా రిలీజ్ చేయటానికి రెడీగా ఉన్నాం.
- ప్రకాష్ రాజు గారు చాలా మంచి మనసున్న వ్యక్తి. తను చేసే సహాయం తన పక్క చేతికి కూడా తెలియనంతగా హెల్ప్ చేస్తాడు. తను ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వర్క్ చేశారు.
- మా సినిమాకు పెద్ద సినిమాలకి ఇచ్చిన టికెట్ రేట్స్ కాకుండా గవర్నమెంట్ ఇచ్చిన రేట్స్ పరంగానే మా సినిమాకు టికెట్స్ ఇవ్వమని డిస్ట్రిబ్యూటర్లని, ఎగ్జిబిటర్లని అడిగితే, వారందరూ అంగీకరించారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం.