Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా వెంకట్ వందెల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా'. జివిఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారథ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావు నిర్మిస్తున్నారు.
'పుడిమిని తడిపే తొలకరి మొరుపుల చినుకమ్మా .. నా వెంటే పడుతున్న చిన్నాడెవడమ్మా..' అంటూ సాగే పాట ప్రోమోని చిత్ర బృందం ఇటీవల విడుదల చేసింది. సంగీత దర్శకుడు సందీప్ కుమార్ అందించిన ఈ పాటను నటుడు, రచయిత, దర్శకుడు తణికెళ్ళ భరణి లాంచ్ చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, 'పాట చూశాను. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ, భవ్వ దీప్తి సాహిత్యం చాలా బాగుంది. సినిమా మంచి విజయం సాధించాలి' అని అన్నారు. 'పల్లెటూరి నేపథ్యంలో సాగే చక్కటి ప్రేమకథ ఇది. తణికెళ్ళ భరణి గారు మా చిత్రంలో చేసిన కీలక పాత్ర హైలెట్గా నిలుస్తుంది' అని దర్శకుడు వెంకట్ వందెల చెప్పారు. నిర్మాత ముల్లేటి నాగేశ్వరావు మాట్లా డుతూ, 'తాజాగా విడుదల చేసిన పాటకు మంచి స్పందన లభించింది. సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది' అని తెలిపారు.