Authorization
Mon Jan 19, 2015 06:51 pm
65 సంవత్సరాల వద్ధ మహిళ లతా కారే తన భర్త ఆరోగ్యం క్షీణించినప్పుడు .. ఎస్కె మారథాన్ పరుగు పందెంలో గెలిచి, తన భర్తను ఎలా కాపాడుకుంది అనే రియలిస్టిక్ కథాంశంతో 'లతా భగవాన్ కరే' చిత్రం రూపొందింది.
పరంజ్యోతి ఫిలిం క్రియేషన్ పతాకంపై నవీన్ దేశబోయిన దర్శకత్వంలో ఎర్రబోతు కష్ణ మరాఠీలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించాలని దర్శకుడు నవీన్, నిర్మాత కష్ణ ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు నవీన్ మాట్లాడుతూ, 'ఈ సినిమా కథని పాఠ్యపుస్తకాల్లో ప్రచురించాలని మరాఠి ప్రభుత్వం ఆర్డర్ చేసింది. నా మొదటి చిత్రానికే జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు రావడం ఆనందంగా ఉంది. ఇదే బ్యానర్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేసి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తాం' అని తెలిపారు. చిత్ర నిర్మాత ఎర్రబోతు కష్ణ మాట్లాడుతూ, 'అందరికీ రీచ్ అయ్యే స్ఫూర్తిదాయక సందేశాత్మక చిత్రమిది. అందుకే పాన్ ఇండియా ఫిలిం చేస్తున్నాం' అని చెప్పారు.