Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వ విఖ్యాత నట సార్వభౌమగా యావత్ తెలుగు ప్రజానీకం మనసులపై చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఎన్టీఆర్. నటుడిగా, ప్రజానాయకుడిగా చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఈనెల 28 నుండి ప్రారంభం కానున్నాయి. నందమూరి తారక రామారావు పుట్టిన నిమ్మకూరులో ఈ వేడుకలను ఈనెల 28న ఉదయం బాలకష్ణ చేతుల మీదుగా అత్యంత ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ శత జయంతి వేడుకలు గుంటూరులోను, తెనాలిలోనూ ఘనంగా జరుగనున్నాయి. అలాగే
ఏడాది మొత్తం జరగనున్న కార్యక్రమాలను సైతం బాలకష్ణ ఆధ్వర్యంలోనే
ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వీటికి సంబంధించిన ఏర్పాట్లు భారీగా చేశారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు అంటే, 10 కోట్ల మంది తెలుగు వారికి ప్రతి ఇంటి పండగ. ఈ వేడుకలకు అభిమానులు సైతం భారీగా హాజరు కాబోతున్నారు. స్వర్గీయ తారక రామారావు గారి శత జయంతి వేడుకలకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే నిర్వాహకులు ప్రకటించనున్నారు.