Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతీయస్థాయిలో పలు అవార్డులు సొంతం చేసుకుని, టాలీవుడ్ గర్వించే సంస్థగా పేరు పొందిన సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్.
ఆ సంస్థ అధినేత ఏడిద నాగేశ్వర రావు మనవరాలు శ్రీజ నిర్మాతగా మారి శ్రీజ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తొలి చిత్రానికి శ్రీకారం చుట్టారు. 'ఫస్ట్ డే ఫస్ట్ షో' అని టైటిల్ ఖరారు చేసిన ఈ చిత్ర లోగోను సోమవారం ప్రసాద్‌ల్యాబ్‌లో దర్శకుడు నాగ్ అశ్విన్ ఆవిష్కరించారు. ఈ చిత్రానికి 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ శిష్యులు వంశీ, లక్ష్మీనారాయణ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ,'పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ ది గొప్ప గ్రేట్ జర్నీ. అలాంటి గొప్ప సంస్థ మళ్ళీ మొదలవ్వడం చాలా ఆనందంగా ఉంది. శంకరాభరణం, స్వాతిముత్యం.. ఇలా చాలా క్లాసిక్ మూవీలు వారి సంస్థ నుంచి వచ్చాయి. ఇంత పెద్ద సంస్థలో అవకాశం ఉంటే తప్పకుండా నేను సినిమా చేస్తాను. 'జాతిరత్నాలు' కంటే పెద్ద హిట్ కావాలి' అని చెప్పారు.
'మా పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ నుంచి మంచి సినిమాలు వచ్చాయి. అలాంటి మంచి సినిమాలు చేయాలని నా కుమార్తె శ్రీజ ఎనిమిది సంవత్సరాలుగా అంటుండేది. అల్లు అరవింద్‌గారి ప్రోత్సాహంతో ఈ సినిమా స్టార్ట్ చేశాం. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి' అని ఏడిద శ్రీరామ్ తెలిపారు. నిర్మాత శ్రీజ మాట్లాడుతూ, 'క్లాసికల్ టచ్ చేయకుండా శ్రీజ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఫ్యామిలీతో హాయిగా నవ్వుకునే సినిమాలు చేయాలని ఈ సినిమాని నిర్మిస్తున్నాం' అని చెప్పారు.