Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై రవిశంకర్, నవీన్ యేర్నేని ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'ఖుషి' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ పోస్టర్లో విజరు దేవరకొండ, సమంత జంట లుక్ ఫిదా చేస్తోంది. అంతేకాదు పవన్‌కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన 'ఖుషి' సినిమాని ఈ టైటిల్ మరోసారి గుర్తు చేసింది. ఈ టైటిల్ పెట్టడంతో ఈ సినిమాపై సర్వత్రా భారీ క్రేజ్ ఏర్పడింది.
'విజయ్, సమంత కెరీర్లో ఇదొక మెమొరబుల్ ఫిల్మ్‌గా నిలుస్తుంది.. టైటిల్, ఫస్ట్ లుక్‌తో ఈ సినిమా సర్వత్రా పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. ప్రేమలో గెలిస్తే ఖుషి, ఆ ప్రేమను కుటుంబంతో పంచుకుంటే మరింత ఖుషి. జీవితంలో ఈ సంతోషాన్ని మించిన సంపద లేదు అనే రీతిలో 'ఖుషి' టైటిల్, ఫస్ట్ లుక్ డిజైన్ క్రియేటివ్‌గా ఉండి ఆకట్టుకుంటున్నాయి. డిసెంబర్ 23న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం. ప్రస్తుతం చేస్తున్న కశ్మీర్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక, హైదరాబాద్, వైజాగ్, మిగిలిన చిత్రీకరణ చేస్తాం. సినిమా చాలా బాగా వస్తోంది. మా బ్యానర్లో రూపొందుతున్న మరో బ్లాక్‌బస్టర్ ఇది. విజరు దేవరకొండ, సమంత పాత్రలను దర్శకుడు శివ నిర్వాణ అత్యద్భుతంగా డిజైన్ చేశారు. మరోసారి మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు గర్వంగా ఫీలవుతున్నాం' అని నిర్మాతలు చెప్పారు. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి ఆర్ట్: ఉత్తర్ కుమార్, చంద్రిక, ఫైట్స్: పీటర్ హెయిన్, రచనా సహకారం: నరేష్ బాబు.పి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దినేష్ నరసింహన్, ఎడిటర్ : ప్రవీణ్ పూడి, ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్, మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్, సి.ఇ.ఓ : చెర్రీ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: జి.మురళి, నిర్మాతలు : నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ.