Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో ఏషియాసిన్ మీడియా, జీవీఆర్ ఫిల్మ్ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'ఛేజింగ్'. కె.వీర కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జి. వెంకటేశ్వరరావు, మదిలగన్ ముని యండి నిర్మించారు. తాజాగా ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో దర్శకులు వి.సముద్ర, సూర్యకిరణ్, నిర్మాత రామసత్య నారాయణ టీజర్‌ను విడుదల చేసి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ పద్మశాలి సంఘం వైస్ ప్రెసిడెంట్, సుప్రభ హౌటల్ సిఎమ్‌డి గుండు ప్రభాకర్ మాట్లాడుతూ, 'నిర్మాతలు గ్రాండ్‌గా ఈ సినిమాని నిర్మించారని టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను' అని తెలిపారు. 'ఇది మా కాంబినేషన్లో మొదటి సినిమా అయినప్పటికీ ఖర్చు విషయంలో ఎక్కడా వెనుకాడలేదు. ప్రేక్షకుల్ని మెప్పించే వినూత్న కథతో ఈ సినిమా తీశాం' అని చిత్ర నిర్మాతలు జి. వెంకటేశ్వరరావు, మదిలగన్ మునియండి అన్నారు.