Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడివి శేష్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం 'మేజర్'. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది.
'పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో మేజర్ సందీప్ జీవితంలోని అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. వీటితోపాటు ఆయనకు సంబంధించిన విభిన్న కోణాలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు గ్రిప్పింగా చూపించబోతున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన మొదటి పాట 'హదయం..' సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాటలో ప్రేమ కథని అందంగా చూపించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం నుండి సెకెండ్ సింగల్ 'ఓV్‌ా ఇషా' వీడియో సాంగ్‌ను నేడు (బుధవారం) విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో శేష్, సయీ మంజ్రేకర్ కెమిస్ట్రీ అందర్నీ అలరిస్తోంది. 1995లో యంగ్ సందీప్ లవ్ లైఫ్‌ని ఈ పోస్టర్లో ఆవిష్కరించారు. అలాగే పోస్టర్ డిజైన్ కూడా 1995 పాత ఆడియో క్యాసెట్ అంచులను గుర్తు చేస్తూ వింటేజ్ లుక్‌లో డిజైన్ చేశారు. ఈ పాట మరో రొమాంటిక్ మెలోడీగా ఉండబోతోంది. పలు భాషలకు చెందిన ముగ్గురు సూపర్స్టార్లు విడుదల చేసిన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ దేశవ్యాప్తంగా ఆదరణ పొందింది. ఇప్పటివరకూ ట్రైలర్ 35 మిలియన్ల వ్యూస్, 900కేకి పైగా లైక్‌లను పొందింది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీ స్థాయిలో నిర్మించింది. 26/11 ముంబై దాడులలో దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన బ్రేవ్ హార్ట్ మేజర్ సందీప్ ఉన్నికష్ణన్కు ఘనమైన నివాళిగా రూపొందిన ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందించారు. 2022లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఈ చిత్రం తొలి జాబితాలో ఉండనుంది' అని చిత్ర యూనిట్ తెలిపింది.