Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సంపూర్ణేష్ బాబు ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఓ ఎత్తైతే ఈ సినిమా మరో ఎత్తు. ఈ సినిమాలో సంపూని సరికొత్తగా చూస్తారు. ఆయన కెరీర్లోనే 'ధగడ్ సాంబ' బెస్ట్ సినిమా అవుతుంది' అని దర్శకుడు ఎన్.ఆర్.రెడ్డి చెప్పారు.
బి.ఎస్.రాజు సమర్పణలో ప్రవీణ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సంపూర్ణేష్ బాబు, సోనాక్షి జంటగా ఆర్ ఆర్. బీహెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మించిన చిత్రం 'ధగడ్ సాంబ'. ఈ నెల 20న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు ఎన్.ఆర్.రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, '1993లో ఇండిస్టీకి ఆర్టిస్టుగా వచ్చాను. ఆ తర్వాత కొన్ని పరిస్థితులు కారణంగా బిజినెస్ వైపు వెళ్ళాను. అయినా సినిమా మీద ఇంట్రెస్ట్‌తో మళ్లీ ఇండిస్టీకి వచ్చాను. దర్శకుడిగా నాకిది మొదటి చిత్రం. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, లిరిక్స్, పాటలు ఇలా.. అన్ని నేనే రాశాను. ఈ కథ సినిమాటోగ్రాఫర్ ముజీర్ గారికి బాగా నచ్చడంతో సంపూర్ణేష్‌తో మాట్లాడి, ఈ ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కేలా చేశారు. సంపూ గారి బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా నేను రాసుకున్న కథను 30% మార్పు చేశాం. ఇదొక రివెంజ్ స్టొరీ. ఇందులో ఐదు ఫైట్స్, ఐదు సాంగ్స్ ఉంటాయి. కథ సీరియస్‌గా నడిచినా అందులోనే కామెడీ ఉంటుంది తప్ప కావాలని పెట్టినట్టు పేరడీ కామెడీ ఈ సినిమాలో ఉండదు. అలాగే ఈ సినిమాలోని ట్విస్ట్‌లు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. అన్ని రకాల ఎమోషన్స్‌తో ఉన్న మొదటి సినిమా ఇదే అవుతుంది. ముజీర్గారు డిఓపిగానే కాకుండా ఈ సినిమా పూర్తి కావడానికి మెయిన్ పిల్లర్‌గా నిలబడ్డారు. సంపూ గారి యాక్టింగ్, బాలు కొరియోగ్రఫీ, డేవిడ్ మ్యూజిక్, పాపారావు ఎడిటింగ్, రాజు మాస్టర్ అసిస్టెంట్స్ ఫైట్స్, యాక్షన్స్ సీన్స్ఈ సినిమా హైలెట్ అవుతాయి. భాషా, జ్యోతి, అప్పారావు, చలాకీ చంటి, ఫిష్ వెంకట్ చాలా బాగా నటించారు. ఈ సినిమాతో దర్శకుడిగా నాకు మంచి గుర్తింపు తప్పకుండా లభిస్తుంది' అని అన్నారు.