Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా కారణంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కి మంచి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఓటీటీ రంగంలో సరికొత్త వినోద విప్లవాన్ని ఆవిష్కరించేందుకు 'డ్యూడ్' ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
సినీ అతిరథుల సమక్షంలో 'డ్యూడ్' ఓటీటీ యాప్ లాంచ్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, 'ఇంత చిన్న వయసులో అన్ని సెక్షన్స్ చూసుకుంటూ ఓటీటీ రంగంలోకి ఎంటరై ట్యాలెంట్ ఉన్న వారికి అవకాశం ఇవ్వడానికి ముందుకు వచ్చిన ఈశ్వర్, ఆయన టీంకు అల్ ద బెస్ట్' అని అన్నారు
దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వీడియో బైట్ ద్వారా మాట్లాడుతూ, 'ఇప్పటి వరకు చాలా ఓటీటీలు ఉన్నా, డ్యూడ్ ఓటీటీ ద్వారా ఈశ్వర్, సాహిత్, క్రియటివ్ టీం వీరందరూ కలిసి, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చేస్తున్న కొత్త ప్రయత్నం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను' అని చెప్పారు.
'మా హార్డ్ వర్క్ నచ్చి విజయేంద్ర ప్రసాద్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఇంప్రెస్ అవ్వడం హ్యాపీగా ఉంది. 'డ్యూడ్' అనేది ఒక బ్రాండ్ కావాలి. అంతేకాదు 'డ్యూడ్' ఓటీటీ డోర్స్ ఎప్పుడూ ప్రతిభ ఉన్న వారిని వెల్ కమ్ చెబుతుంది. కోటి రూపాయలకు తీసే సినిమాను నేను 30 లక్షలకు సినిమా తీస్తాను.అంటే కోటి రూపాయలకు మూడు సినిమాలు అంటే 300 కోట్లకు తొమ్మిది వందల సినిమాలు అంటే 900 మంది డైరెక్టర్స్‌ను ఒకేసారి లాంచ్ చేసే గట్స్ మా ఓటీటీకి ఉంది. మా ఓటీటీలో సినిమా కంటెంట్ మాత్రమే కాకుండా వెబ్ సిరీస్, గేమ్స్, స్పోర్ట్స్, లైవ్ న్యూస్, కిడ్స్ కంటెంట్, ఈవెంట్స్, లైవ్ ఈవెంట్స్ ఇలా అన్ని రకాల కంటెంట్‌తో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తాం' అని దర్శక, నిర్మాత 'డ్యూడ్' ఓటీటీ వ్యవస్థాపకుడు ఈశ్వర్ చెప్పారు.