Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఎఫ్ 3'.. పక్కా ఫైసా వసూల్ సినిమా. వంద రూపాయలు పెట్టి సినిమా చూస్తే, మూడు వందల రూపాయల ఆనందం వస్తుంది' అని కమెడియన్ అలీ అన్నారు.
వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. దిల్ రాజు సమర్పణ లో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 27న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన అలీ బుధవారం మీడియాతో ముచ్చటించారు.
ఈ సినిమాలో పాత అలీని తప్పకుండా చూస్తారు. నా క్యారెక్టర్లో అంత సత్తా ఉంది. లొకేషన్లో కూడా అందరూ బాగా ఎంజారు చేశారు. శిరీష్ గారైతే 35 సార్లు చూసి కిందపడి మరీ నవ్వారని దర్శకుడు అనిల్ చెప్పారు. ఇందులో నా క్యారెక్టర్ పేరు పాల బేబీ. వడ్డీకి తిప్పే క్యారెక్టర్ నాది. ఆడవాళ్లు అంటే అపారమైన గౌరవం అనే విషయం సినిమా ఎండింగ్లో మీకు తెలుస్తుంది (నవ్వుతూ).
సినిమా మొత్తంలో 45 నిమిషాలకు పైగా నా పాత్ర ఉంటుంది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ ఒకరిని మించి మరొకరు నటించారు. ఎవ్వరిని తగ్గించలేం. చిన్న క్యారెక్టర్ కూడా సినిమాలో కీలకం. కొన్ని సీన్స్ మిస్ అయిపోయామే.. మళ్లీ వెళ్లాలిరా.. అనేలా ఆడియన్స్ థియేటర్లకు వస్తారు.
ఇందులో వెంకటేష్, వరుణ్‌తేజ్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. వెంకటేష్‌గారితో నేను చేసినా సినిమాలన్ని కామెడీ చిత్రాలే. కామెడీ చేయడంలో చిరంజీవి, వెంకటేష్, మోహన్‌బాబు, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, మహేశ్‌బాబు ఎక్స్‌ఫర్ట్స్. సినిమాలో ఇంత మంది ఆర్టిస్టులు ఉంటే కొంచెం టెన్షన్ ఉంటుంది. కానీ దర్శకుడు అనిల్‌లో అది కొంచెం కూడా కనిపించదు. అలాగే ఎంతమంది ఆర్టిస్టులు కావాలంటే అంతమందిని నిర్మాత దిల్‌రాజు ఎరేంజ్ చేశారు. ఇలాంటి నిర్మాత అనిల్‌కి దొరకటం అదృష్టం.
ప్రస్తుతం 'అంటేసుందరానికి', 'లైగర్', 'ఖుషి', 'ఒకే ఒక జీవితం' సినిమాలతో పాటు తమిళ వెబ్ సిరీస్ చేస్తున్నా. కన్నడలో ధవ సర్జా సినిమాతోపాటు ఓ నేపాలి సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నా. మంచి కథ, మంచి పాత్ర దొరికితే వెంటనే గ్రీన్‌సిగల్ ఇచ్చేస్తా. ఏ పాత్ర చేసినా ప్రేక్షకుల్ని నవ్వించడమే నా లక్ష్యం.