Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని డైరెక్ట్ చేశాననేది నాకు మొదటి కిక్. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం అనేది రెండో కిక్. అలాగే మహేష్ గారిని కొత్తగా చూపించారని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవ్వడం మరింత పెద్ద కిక్ ఇచ్చింది' అని దర్శకుడు పరశురాం చెప్పారు. మహేష్‌బాబు, కీర్తిసురేష్ జంటగా పరశురాం దర్శకత్వంతో రూపొందిన చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమా ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ టాక్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు పరశురాం తన ఆనందాన్ని మీడియాతో షేర్ చేసుకున్నారు.
ఊహించినట్టే జరిగింది
'సర్కారు వారి పాట' కథ అనుకున్నప్పుడే మహేష్ బాబు గారి కెరీర్లో పెద్ద హిట్ అవ్వాలని భావించాం. దానికి తగ్గట్టే క్యారెక్టర్, మేనరిజమ్స్, లుక్స్ డిజైన్ చేశాం. మేం ఊహించినట్లే సినిమా ఘన విజయం సాధించింది. కొత్త మహేష్ బాబుని చూస్తున్నామనే ఫీడ్ బ్యాక్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి వచ్చింది. రిలీజ్ రోజు మార్నింగ్ మహేష్ గారు కాల్ చేసి.. 'అన్ని చోట్ల నుండి బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. కంగ్రాట్స్' అని ఆయనే రివర్స్‌లో కంగ్రాట్స్ చెప్పారు. అలాగే దర్శకుడు సుకుమార్, హరీష్ శంకర్, పూరి గారు కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. 'ఇంత హెవీ కథని ఇంత లైటర్ వీన్లో వినోదాత్మకంగా ట్రీట్ చేయలేను. ఇది నీ ఒక్కడికే సాధ్యం' అని సుకుమార్ గారు కాంప్లిమెంట్ ఇవ్వడం మరింత ఆనందంగా ఉంది. అలాగే మహేష్ గారి ఫ్యాన్స్ దగ్గర నుండి భారీ స్పందన వచ్చింది. ఫ్యాన్స్ ఫోన్ చేసి మా హీరోని ఇలా చూస్తామని జన్మలో కూడా అనుకోలేదు. అద్భుతంగా చూపించారని అభినందించారు. ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర్నుంచి మా టెక్నిషియన్లు అందరూ మరో 'పోకిరి' అంటూ బాగా ప్రోత్సహించారు. ఈ బ్లాక్‌బస్టర్ ఆనందాన్ని సూపర్‌స్టార్ కృష్ణగారి బర్త్‌డే రోజు ఆయన్ని కలిసి షేర్ చేసుకుంటా.
బలమైన కథే కారణం
ఈ సినిమాతో నేను బిగ్ స్టార్ డైరెక్టర్ లీగ్‌లోకి వెళ్ళారని అంతా భావిస్తున్నారు. అలాగే ఇకపై నా సినిమాలు భారీగా ఉంటాయని అంటున్నారు. అయితే దేనికైనా మంచి కథ కుదరాలి. మహేష్ బాబు గారు ఈ సినిమా చేశారంటే కారణం కథే కదా. బలమైన కథ ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది. నా తదుపరి సినిమా 14రీల్స్‌లో నాగచైతన్య హీరోగా చేస్తున్నాను.