Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు సత్యదేవ్ నటిస్తున్న తాజా చిత్రం 'గాడ్సే'. గోపి గణేష్ పట్టాభి దర్శకుడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో 'బ్లఫ్ మాస్టర్' వంటి సూపర్ హిట్ మూవీ రూపొందింది. మరోసారి ఈ హిట్ కాంబో కలిసి చేస్తున్న ఈ చిత్రాన్ని సి.కె.స్క్రీన్స్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మించారు. ఈ చిత్రాన్ని జూన్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ, 'సమాజంలో భాగమైన రాజకీయ వ్యవస్థ అవినీతమయమైనప్పుడు అరాచకం పెరుగుతుంది. అలాంటి అవినీతి రాజకీయానికి కేరాఫ్ అయిన కొంత మంది నాయకులను ఓ యువకుడు ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా. రాజకీయ వ్యవస్థను ప్రశ్నించే యువకుడు 'గాడ్సే'గా సత్యదేవ్ అత్యద్భుతంగా నటించాడు. వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సత్యదేవ్‌కి 'గాడ్సే'గా ఈ సినిమా మరింత మంచి గుర్తింపునిస్తుంది. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్మెంట్ చేసిన దగ్గర్నుంచి అంచనాలు పెరిగాయి. ఆ తర్వాత టీజర్‌తో ఈ అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాను అద్భుతంగా డైరెక్ట్ చేయటంతో పాటు అందర్నీ అలరించే కథ, స్క్రీన్‌ప్లే, మాటలను కూడా గోపి గణేష్ అందించారు. ఐశ్వర్య లక్ష్మి ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపించనుంది. బ్రహ్మాజీ, సిజ్జూ మీనన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మా బ్యానర్ నుంచి వస్తున్న మరో బ్లాక్‌బస్టర్ సినిమాగా 'గాడ్సే' తప్పకుండా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం' అని తెలిపారు.