Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'డెత్ బెడ్ నుండి తిరిగొచ్చి సినిమా చేయగలిగానంటే దానికి కారణం మీ అందరి ఆశీర్వాదమే. అందరూ కలిసి నన్ను బతికించినట్లే నా సినిమాను ఆదరించి, మమ్మల్ని మళ్ళీ బతికించండి' అని హీరో రాజశేఖర్ అన్నారు.
వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై డా. రాజశేఖర్ హీరోగా రూపొందిన చిత్రం 'శేఖర్'. జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మించారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 20న గ్రాండ్‌గా ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ, 'నా జీవితంలో రాజశేఖర్ గారితో నిజమైన ఎక్స్పీరియన్స్ ముడి పడింది. ఆయన హీరోగా పీక్‌లో ఉన్నప్పుఫుడు 'ఆహుతి', 'ఆగ్రహం', 'తలంబ్రాలు', 'మగాడు', 'అంకుశం' వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు చూసి, ఆయనకు వీరాభిమాని నయ్యాను. అప్పుడే మొట్ట మొదటి సారి నేను కూడా సినిమాలు చేయగలను అనే కాన్ఫిడెంట్ వచ్చింది. నా సినిమా లైఫ్‌ను ఇంత అద్భుతంగా మార్చినందుకు ఆయనకు చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో ఆయన ఎంతో అద్భుతంగా నటించారు. జీవితగారు ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డారు. ఆమె కష్టానికి మంచి ఫలితం రావాలని ఆశిస్తున్నాను' అని అన్నారు. 'మీరందరూ థియేటర్‌కు వచ్చి చూడండి. మా సినిమా నచ్చితేనే.. పదిమందికి చెప్పండి. అప్పుడే మాతో పాటు సినిమా ఇండిస్టీ కూడా బాగుంటుంది. ఈ సినిమా కోసం నాకంటే కూడా జీవిత చాలా కష్టపడింది. అలాగే మా ఇద్దరు కూతుర్లు కూడా పోస్ట్ ప్రొడక్షన్లో జీవితకు చాలా హెల్ప్ చేశారు. అందరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది' అని హీరో రాజశేఖర్ చెప్పారు. 'అనూప్ గారు చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. డిఓపి గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. మా నిర్మాతలు రాలేకపోయినా వారెంతో మాకు సపోర్ట్ చేశారు. నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ సపోర్ట్ చేయడంతో ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా మా నాన్నకు గొప్ప విజయం అందించాలి. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కచ్చితంగా అలరిస్తుంది' అని రాజశేఖర్ తనయలు శివాని, శివాత్మిక అన్నారు.
ఈ సినిమా చాలా మంచి సినిమా. ఇప్పటివరకు మంచి సినిమాలను
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ వచ్చారు. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమాను కూడా ఆదరించండి. అలాగే టికెట్ రేట్స్ పెరగడం వల్ల ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం లేదని తెలిసింది. మా సినిమాకి టికెట్ రేట్స్ పెంచడం లేదు.
గవర్నమెంట్ పెట్టిన రేట్లకే మా సినిమాను ప్రదర్శిస్తున్నాం.
- దర్శకురాలు జీవిత రాజశేఖర్