Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'కరణ్ అర్జున్'. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో డా.సోమేశ్వరరావు పొన్నాన, బాలకృష్ణ ఆకుల, సురేష్, రామకష్ణ, క్రాంతి కిరణ్ నిర్మించారు. రవి మేకల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ట్రైలర్ చాలా బాగుంది. విజువల్స్ చాలా ప్రామిసింగ్‌గా ఉన్నాయి. ఒక యంగ్ టీమ్ ఎంతో రిస్క్ చేసి పాకిస్తాన్ బోర్డర్లో చిత్రీకరణ చేయటం అభినందనీయం. ట్రైలర్ లాగే సినిమా కూడా బాగుంటుందని ఆశిస్తున్నాను' అని అన్నారు.
'ట్రైలర్లో విజువల్స్, లొకేషన్స్ బాగున్నాయంటూ అనిల్ రావిపూడి గారు ప్రత్యేకంగా చెప్పడంతో పాటు మా టీమ్ అందరినీ మెచ్చుకోవడం మాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. మూడు పాత్రలతో రోడ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రతి సన్నివేశం ఎవరూ ఊహించని విధంగా ఉంటూ ఆడియన్స్‌ని ఎంటర్ టైన్ చేస్తుంది. కంటెంట్‌ని నమ్ముకుని చేసిన సినిమా ఇది' అని దర్శకుడు మోహన్ శ్రీవత్స చెప్పారు.
నిర్మాతల్లో ఒకరైన బాలకష్ణ ఆకుల మాట్లాడుతూ, 'మా ట్రైలర్ అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం' అని తెలిపారు.
'మా సినిమా ఫస్ట్ లుక్‌ను డైరెక్టర్ పరశురామ్‌గారు, ట్రైలర్‌ను అనిల్ రావిపూడి గారు లాంచ్ చేసి, టైటిల్, ట్రైలర్ అదిరిపోయాయంటూ కితాబివ్వడం హ్యాపీగా ఉంది. ఓ మంచి కంటెంట్‌తో వస్తున్న మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది' అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి మేకల చెప్పారు.