Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'కాలేజ్ డాన్' సక్సెస్‌మీట్‌లో శివ కార్తికేయన్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తాజాగా నటించిన చిత్రం 'కాలేజ్ డాన్'. ఈ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. శిబి చక్రవర్తి దర్శకత్వంలో శివకార్తికేయన్ ప్రొడక్షన్స్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం గురువారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా హీరో శివ కార్తికేయన్ మాట్లాడుతూ, 'మా చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన నిర్మాత ఎన్వీ ప్రసాద్‌కి ప్రత్యేక కతజ్ఞతలు. ఈ సినిమా అందరికీ నచ్చడం ఆనందంగా ఉంది. దర్శకుడు శిబి చక్రవర్తి స్క్రిప్ట్ వినిపించినపుడు, ఈ కథ అందరికీ నచ్చుతుందని అనుకున్నాం. మా నమ్మకం నిజమైంది. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఆయనే నాకు రోల్ మోడల్. ఆయనకి ఈ చిత్ర విజయాన్ని అంకితం చేస్తున్నాను' అని అన్నారు 'ఈ సినిమా సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. మొదటి రోజు నుండి ఇప్పటివరకూ వంద శాతం వసూళ్ళతో సినిమా దూసుకెళ్తోంది' అని నిర్మాత ఎన్వీ ప్రసాద్ చెప్పారు. దర్శకుడు శిబి చక్రవర్తి మాట్లాడుతూ, 'శివ కార్తికేయన్ లేకపోతే ఈ సినిమా లేదు. హీరోగానే కాదు నిర్మాతగా కూడా ఈ చిత్రానికి ఒక పిల్లర్‌లా నిలబడ్డారు. ఇంత పెద్ద విజయం అందించిన తెలుగు ప్రేక్షకులకు కతజ్ఞతలు' అని తెలిపారు.