Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓఎస్ఆర్ కుమార్ ఇండియన్ పిక్చర్స్ బ్యానర్‌పై 'ఆట' సందీప్ హీరోగా నటిస్తున్న రెండవ చిత్రం 'రేంజ్ రోవర్'. ఓఎస్ఆర్ కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మితమవుతున్న ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్‌ను ప్రముఖ హాస్య నటుడు అలీ విడుదల చేసి, చిత్ర బృందాన్ని అభినందించారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత ఓఎస్ఆర్ కుమార్ మాట్లాడుతూ, 'ఇదొక భిన్న సస్పెన్స్ థ్రిల్లర్. అలీగారు రిలీజ్ చేసిన టైటిల్, ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే చిత్ర ట్రైలర్, సాంగ్స్‌ను విడుదల చేస్తాం. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు. జ్యోతి రాజ్ ఐటెమ్ సాంగ్‌తో సర్ప్రైజ్ చేయనున్న ఈ చిత్రంలో మేఘన రాజపూత్, అరవింద్ యతి రాజ్, బ్యాంక్ జనార్ధన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు: ఎస్.ధర్మేంద్ర, కిషోర్ సింగ్ ఎం., మ్యూజిక్ డైరెక్టర్: సత్య సోమేష్, డిఓపి: రాజ్ శివశంకర్, ఎడిటర్: జె.గురు ప్రసాద్.