Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం 'షికారు'. సాయి ధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, ధీరజ్, నవకాంత్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ సినిమాకి హరి కొలగాని దర్శకత్వం వహిస్తున్నారు. పి.ఎస్.ఆర్ కుమార్ (బాబ్జి, వైజాగ్) నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్‌తోపాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ చిత్రంలోని 'ఫ్రెండే తోడుండగా..' అంటూ సాగే రెండవ పాటను అగ్ర నిర్మాత దిల్‌రాజు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ సినిమాను మా బాబ్జీ నిర్మాతగా కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ, కొత్తవారితో నిర్మించటం అభినందనీయం. ఇందులో నటించిన తేజ్ మా 'రౌడీ బార్సు'లో నటించాడు. ఇటీవల ఈ సినిమాలోని తొలి సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఆ పాట అందరికీ బాగా రీచ్ అయ్యింది. తాజాగా రిలీజ్ చేసిన పాట స్నేహంలోని మాధుర్యాన్ని తెలియజేస్తుంది. తొలిపాట మాదిరిగానే ఈ పాట కూడా పెద్ద హిట్ కావాలి. ఈ సినిమా యూత్‌కు బాగా రీచ్ అవుతుందని నమ్ముతున్నాను' అని తెలిపారు.
'మా సినిమాలోని రెండో పాటను దిల్‌రాజు గారు ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, జూన్ 24న మా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం' అని నిర్మాత బాబ్జీ చెప్పారు.
కన్నడ కిషోర్, పోసాని కృష్ణ మురళి, గాయత్రి రెడ్డి (బిగిల్ ఫేమ్ ), చమ్మక్ చంద్ర, అన్నపూర్ణమ్మ, సురేఖా వాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి లిరిక్స్ : భాస్కర భట్ల రవికుమార్, సంగీతం : శేఖర్ చంద్ర.