Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రక్తంతో తడిసిన మట్టికి మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయే అర్హత ఉంటుంది. అతని మట్టి... అతని పాలన... కానీ అతని రక్తం మాత్రం కాదు...'
ఇలా.. ఓ ఇంటెన్స్ మూడ్‌తో ఉన్న ఈ డైలాగ్స్ వింటుంటే ఓ ఆసక్తికరమైన రూపొందుతోందనే విషయం వేరే చెప్పక్కర్లేదు.
ఈ ఆసక్తికరమైన సినిమా ఎన్టీఆర్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్‌నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతోందంటే నో డౌట్ ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటాయో కూడా ఊహించొచ్చు. శుక్రవారం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నయా సినిమా సినిమాకి సంబంధించి పోస్టర్ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఎన్టీఆర్ తన కెరీర్లో హీరోగా నటిస్తున్న 31వ చిత్రమిది. ఎన్టీఆర్.. మాస్ ఆడియెన్స్ కోరుకునే పర్ఫెక్ట్ హీరో, ప్రశాంత్ నీల్.. మాస్ ఆడియన్స్ కావాలనుకునే పర్ఫెక్ట్ డైరక్టర్. వీరిద్దరూ కలిసి చేసే సినిమా వెండితెర మీద మాస్ సినిమాలకు సరికొత్త నిర్వచనంలా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు.
ఈ సినిమా గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ, '20 ఏళ్ల క్రితం నా మనసులో మెదిలిన ఆలోచనకు రూపమే ఈ సినిమా. ఈ సినిమా హద్దులూ, పరిధుల్ని అప్పుడే మనసులో నిర్ణయించుకున్నాను. ఎన్నాళ్లుగానో నా మనసులో పదిలపరచుకున్న నా డ్రీమ్ ప్రాజెక్ట్‌ని, నా డ్రీమ్ హీరో ఎన్టీఆర్‌తో చేయడం చాలా ఆనందంగా ఉంది' అని అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి చేస్తున్న సినిమా ఇది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ చిత్రీకరణకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్ సైతం ఎన్టీఆర్ అభిమానులతోపాటు ప్రేక్షకుల్ని సైతం మెస్మరైజ్ చేసింది. ఇది ఎన్టీఆర్ నటిస్తున్న 30వ చిత్రం. అలాగే కొరటాల శివతో ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' తర్వాత చేస్తున్న చిత్రమిది. దీంతో ఈ సినిమాపై కూడా అటు ఎన్టీఆర్ అభిమానుల్లోను, ఇటు పరిశ్రమ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.