Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్షిత్ శశికుమార్, కీర్తి కల్కరే జంటగా 'బళ్లారి దర్బార్' ఫేమ్ స్మైల్ శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఓ మై లవ్'.
జి.సి.బి. ప్రొడక్షన్స్ పతాకంపై కన్నడ, తెలుగు భాషల్లో జి. రామంజిని నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్‌ని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'స్మైల్ శ్రీను మంచి ప్రతిభగల దర్శకుడు. ఈ సినిమా టీజర్ చూశాను. కన్నడలో పెద్ద బడ్జెట్లో వస్తున్న ప్రేమకథ ఇది. తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ కావడం సంతోషంగా ఉంది. సినిమా క్వాలిటీ చాలా బాగుంది' అని తెలిపారు.
'మా సినిమా టీజర్‌ని విడుదల చేసి, ఎంతో బాగుందని దర్శకేంద్రుడు కితాబివ్వడం మా టీవమ్ అందరికీ ఎంతో ధైర్యాన్నిచ్చింది. ఇదే ఉత్సాహంతో మా చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని దర్శకుడు స్మైల్ శ్రీను చెప్పారు.
సీనియర్ డైరెక్టర్ ఎస్.నారాయణ్, సాధుకోకిల, దేవగిల్, టెన్నిస్ కష్ణ, పవిత్రా లోకేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్, పాటలు: డా. వి.నాగేంద్ర ప్రసాద్, కొరియోగ్రఫీ : మురళి, ఫైట్స్: రియల్ సతీష్, స్టోరీ-ప్రొడ్యూసర్: జి.రామాంజని, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: స్మైల్ శ్రీను