Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ మహాలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పతాకంపై జొన్నలగడ్డ హరికష్ణ, మోక్ష జంటగా రూపొందుతున్న చిత్రం 'ఆటో రజిని'.
హై ఓల్టేజ్ లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని శ్రీనివాస్ జొన్నలగడ్డ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.
గురువారం సాయంత్రం ఎంపి నందిగాం సురేష్ ఆధ్వర్యంలో చిత్ర యూనిట్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని కలిసి ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చూపించి, అయన ఆశీస్సులు అందుకున్నారు.
ఎంపి నందిగాం సురేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు శ్రీనివాస్ జొన్నలగడ్డ మాట్లాడుతూ,' మా సినిమా చిత్రీకరణకి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన ఏపీ ప్రభుత్వానికి హదయ పూర్వక కతజ్ఞతలు. నా మీద నమ్మకంతో ఈ సినిమాలో ఎంపి నందిగాం సురేష్‌గారు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఓ భారీ షెడ్యుల్‌ను విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ దగ్గర జరిపాం. ఈ షెడ్యుల్‌లో కొన్ని ముఖ్య సన్నివేశాలతో పాటు ఎంపి నందిగాం సురేష్, హీరో హరి కాంబినేషన్లో వచ్చే హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ నేతత్వంలో చిత్రీకరణ చేశాం. ఎంపి నందిగాం సురేష్‌గారు అద్భుతంగా నటిస్తున్నారు. తదుపరి షెడ్యుల్‌ను జూన్ 10 నుంచి విజయవాడలో ప్రారంభిస్తాం. జూలై 10 నుంచి నెల్లూరు కష్ణపట్నంలో క్లయిమాక్స్‌ని చిత్రీకరిస్తాం. ఇప్పటివరకు 50 శాతం టాకీ పార్ట్ పూర్తయ్యింది' అని తెలిపారు. ఈ చిత్రానికి మ్యూజిక్ : మణిశర్మ, కెమెరా: ప్రసాద్ బాబు, ఎడిటింగ్ : గౌతంరాజు, డాన్స్ : ప్రేమ్ రక్షిత్, ఫైట్స్ : కనల్ కన్నన్, ఆర్ట్ : చిన్న, కథ : విక్రమ్ రాజా.