Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వంకాయలపాటి మురళీకష్ణ సమర్పణలో సుధాకర్ ఇంపెక్స్ పతాకంపై డా. రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం 'శేఖర్'. జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది.
అన్ని థియేటర్స్‌లో విజయవంతంగా ప్రదర్శితమవుతూ ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ, 'మాది కర్నూల్ జిల్లా నంద్యాల దగ్గర టంగుటూరు అనే చిన్న పల్లెటూరు. మా ఫ్యామిలీ అంతా కోర్ట్ ఎంప్లొర్సు. బిజినెస్‌లో నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాను. బొగ్గారం శ్రీనివాస్‌తో చాలా సంవత్సరాలుగా జర్నీ చేస్తున్నాను. 'కార్తికేయ' సినిమా నుంచి ఇన్వెస్టర్‌గా తనతో జర్నీ చేస్తున్నాను. ఆ సినిమా పెద్ద సక్సెస్ అయ్యింది. అప్పట్నుంచి 15 సినిమాలకు ఇన్వెస్ట్ చేశాను. రాజశేఖర్ గారు నా చిన్నప్పటి ఫెవరేట్ హీరో. 'గరుడవేగ' సినిమాతో ఆయనతో జర్నీ స్టార్ట్ చేశాను. మలయాళం 'జోసెఫ్' సినిమా నాకు బాగా నచ్చింది. దాన్ని 'శేఖర్'గా రీమేక్ చేశాం. మా సినిమా చూసిన ప్రేక్షకులందరూ క్లైమాక్స్ అదిరిపోయిందని, ఆడియన్స్‌కు మంచి మెసేజ్ ఇచ్చారంటూ అభినందించడం చాలా హ్యాపీగా అనిపించింది. మా సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో 300 థియేటర్లలో రిలీజ్ చేస్తే, అన్ని చోట్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. అనూప్ రూబెన్స్ ఇచ్చిన మ్యాజిక్ సినిమాకు 40% హైప్ తీసుకొచ్చింది. రాజశేఖర్, శివాని నటన, జీవితగారి డైరెక్షన్‌కు మంచి మార్కులు పడ్డాయి. మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన మా చిత్రాన్ని ఇంకా పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను' అని అన్నారు.