Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహంకాళి మూవీస్ పతాకంపై అది సాయి కుమార్ హీరోగా, 'బిగ్ బాస్' ఫేమ్ కౌషల్ మండా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న చిత్రం 'బ్లాక్'. జి.బి.కష్ణ దర్శకత్వంలో మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను సాయి కుమార్ పాత్రికేయుల సమక్షంలో శనివారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈనెల 28 చాలా గొప్ప రోజు. ఎన్టిఆర్ గారి జయంతి. అంత గొప్ప రోజు నా కొడుకు ఆది సినిమా విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది. ఆదికి ఈ సినిమా మంచి విజయాన్నిస్తుంది' అని తెలిపారు. 'ఇది చాలా డిఫరెంట్ కథ. ఆది క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. ట్రైలర్ ఎంత బాగుందో, సినిమా కూడా అంతే బాగుంటుంది. అందరికీ నచ్చుతుంది. ఈ చిత్రంలో ఇంటర్వెల్ ఎపిసోడ్ చాలా హైలైట్గా ఉంటుంది' అని దర్శకుడు జి.బి.కష్ణ చెప్పారు.
నిర్మాత మహంకాళి దివాకర్ మాట్లాడుతూ, 'ఈనెల 27న వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన 'ఎఫ్ 3', 28న మా 'బ్లాక్' చిత్రం విడుదల అవుతున్నాయి. ఈ రెండు చిత్రాలు గవర్నమెంట్ నిర్ణయించిన టికెట్ రేట్లకే చూడొచ్చు. మా మహంకాళి బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది' అని అన్నారు. 'ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. ఆయనకు మంచి క్లారిటీ ఉంది. ట్రైలర్ చాలా బాగుందంటూ అందరూ మెసేజ్ చేస్తున్నారు ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే సినిమా ఇది' అని హీరో ఆది సాయి కుమార్ తెలిపారు.
'ఆటగాళ్లు' ఫేమ్ దర్శన బానిక్, ఆమని, పథ్వి రాజ్, సూర్య, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, ఆనంద్ చక్రపాణి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సతీష్ ముత్యాల, సంగీతం : సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ : అమర్ రెడ్డి, ఫైట్స్ : రామకష్ణ, ఆర్ట్ : కె వి రమణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శంకర్, రచన- దర్శకత్వం : జి.బి.కృష్ణ.