Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపీచంద్, మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'పక్కా కమర్షియల్'. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రమిది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న.. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
జులై 1న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
'ఈ సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్‌ను దర్శకుడు మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. 'భలే భలే మగాడివోరు', 'టాక్సీవాలా', 'ప్రతి రోజు పండగే' లాంటి విజయాల తర్వాత జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్ - బన్నీవాసు - కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. గతంలో ఈ బ్యానర్స్ నుంచే దర్శకుడు మారుతి 'భలే భలే మగాడివోరు', 'ప్రతిరోజు పండగే' వంటి బ్లాక్ బస్టర్స్ అందించారు. 'ప్రతి రోజు పండగే' సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. గోపీచంద్‌కి జోడీగా రాశీ ఖన్నా నటిస్తున్న ఈ చిత్రానికి జకేస్ బీజారు సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్కెఎన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తప్పకుండా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని చిత్ర బృందం తెలిపింది.