Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హృషీకేష క్రియేషన్స్, బీష్మా ప్రొడక్షన్స్ పతాకంపై విజరు, శ్రావ్య (తొలిపరిచయం) జంటగా రూపొం దుతున్న చిత్రం 'ఉత్తమ విలన్' కేరాఫ్ మహాదేవపురం.
రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో వి. సాయి లక్ష్మీనారాయణ గౌడ్, పి శ్రవణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర టీజర్‌ను హీరో మంచు మనోజ్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'టీజర్ బాగుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరిస్తుంది. సినిమా గొప్ప విజయం సాధించాలి' అని చెప్పారు.
'చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులను మా చిత్రం అలరిస్తుంది' అని నిర్మాతలు అన్నారు. దర్శకుడు రాజారెడ్డి పానుగంటి మాట్లాడుతూ, 'సినిమా చాలా బాగా వచ్చింది. దుబారు, కొండమడుగు ఊరిలో చిత్రీకరణ చేశాం. ప్రొడ్యూసర్స్ సాయి, శ్రావణ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అన్ని సమకూరుస్తూ ఈ సినమా ఒక రేంజ్లో రావడానికి కారణమయ్యారు' అని తెలిపారు.