Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు నాటక రంగం ఎంతో మంది కళాకారులకు, సాంకేతిక నిపుణులకు జీవనోపాధిని కల్పించింది. పెరుగుతున్న సాంకేతికత కారణంగా ఇప్పుడు నాటక రంగం క్రమక్రమంగా అంతరించిపోతోంది. నాటక రంగ దయనీతి స్థితికి ప్రతి బింబంగా 'ఉత్సవం' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో హీరోగా దిలీప్, హీరోయిన్గా రెజీనా నటించారు. ముఖ్య పాత్రల్ని ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మా నందం, అలీ, రచ్చ రవి, రఘుబాబు, ప్రియదర్శి తదితరులు పోషించారు.
ఈ సినిమా గురించి నిర్మాత సురేష్ పాటిల్ మాట్లాడుతూ, 'సురభి నాటకాలు, కళాకారుల బతుకులు, వాళ్ళ బాధలు, గాథల్ని ఈ సినిమా రూపంలో వెండితెరపై ఆవిష్కరిస్తున్నార. ఈ సినిమా చిత్రీకరణతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది. దర్శకుడు అర్జున్‌సాయి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. అద్భుతమైన విజువల్స్‌తో కెమెరామెన్ రసూల్ ఎల్లోర్ ఈ చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు, అనూప్ రూబెన్స్ తన పాటలతో, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ప్రాణం పోశారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్‌ని నెక్స్ట్ లెవెల్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి రూపొందించిన సెట్స్ అద్భుతంగా ఉంటాయి. మరచిపోతున్న, మరిచిపోయిన నాటకరంగం గురించి, కళాకారుల గురించి వస్తున్న సినిమా. త్వరలోనే ఈ చిత్ర ఫస్ట్ లుక్, టీజర్‌ను విడుదల చేస్తాం' అని తెలిపారు.