Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో శిరీష్
నిర్మించిన ఈ చిత్రం ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో 'ఫన్'టాస్టిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్న శిల్పాకళావేదికలో గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా వెెంకటేష్ మాట్లాడుతూ,'ప్రేక్షకులంతా తప్పకుండా ఎంజారు చేసే సినిమా ఇది. దర్శకుడు అనిల్ రావిపూడి అద్భుతమైన స్క్రిప్ట్ చేశారు. దిల్ రాజు గారితో పని చేయడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. వరుణ్ తేజ్ అద్భుతంగా చేశాడు' అని తెలిపారు.
'ఇది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాలో సునీల్ గారితో నా కాంబినేషన్ చాలా చక్కగా వచ్చింది. మళ్ళీ పాత సునీల్‌ని చూస్తారు. దిల్ రాజు, శిరీష్ గారితో 'ఫిదా', 'ఎఫ్ 2' లాంటి సూపర్ హిట్స్ చేశాను. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతామనే నమ్మకం ఉంది' అని వరుణ్ తేజ్ అన్నారు.
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, 'మీకు వినోదాన్ని పంచాలని, 'ఎఫ్ 2'కి మించి నవ్వించాలని చాలా కష్టపడి పని చేశాం. కరోనా వల్ల ఈ రెండేళ్ళలో చాలా ఒత్తిళ్ళు అనుభవించాం. ఈ నెల 27కి ఏమీ అలోచించకుండా ఈ సినిమాకి వెళ్లి సరదాగా నవ్వుకోండి' అని చెప్పారు.
ఈ సినిమా రెండున్నర గంటల పాటు మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. అనిల్ రావిపూడి ఈ సినిమాని అవుట్ అండ్ అవుట్ హిలేరియస్‌గా డిజైన్ చేశారు. 'ఎఫ్ 2'ని ఎంత చక్కగా ఎంజారు చేశారో దాని కంటే ఎక్కువగా ఈ సినిమాని ఎంజారు చేస్తారు. సెన్సార్ వాళ్ళు ఇప్పటికే సినిమా చూసి చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా ఫుల్ మీల్స్‌లా ఉంటుందని చెప్పారు. ఫ్యామిలీ అంతా హ్యాపీగా నవ్వుకునే సినిమా ఇది.
- దిల్ రాజు